సీనియర్ హీరోని లైట్ తీసుకున్నారు!

సీనియర్ నటుడు మోహన్ బాబు చాలా కాలం తరువాత నటించిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ఈ సినిమాను పలు భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో మోహన్ బాబు కనిపిస్తారని అంతా అనుకున్నారు. కరోనా టైమ్ లో సినిమా ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు తగ్గినప్పటికీ పూర్తిగా మాత్రం ఆగిపోలేదు. ఈ సినిమా ప్రమోషన్స్ కి హీరో సూర్య, దర్శకురాలు సుధా కొంగర ముందుకొచ్చారు. వర్చువల్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. అయితే వీటిలో ఎక్కడా కూడా మోహన్ బాబు కనిపించలేదు.

నిజానికి ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో మోహన్ బాబు ఉన్నాడని తెలిసినప్పటి నుండి ఆ పాత్రపై కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు మోహన్ బాబు పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని భావించారు. కానీ సినిమా చూసిన తరువాత కానీ ఆయన పాత్ర విషయంలో క్లారిటీ రాలేదు. మొత్తంగా చూసుకుంటే ఆయన కనిపించింది కేవలం మూడే మూడు సన్నివేశాల్లో. పోనీ సన్నివేశాలను పక్కన పెడితే.. ఆ పాత్రని డిజైన్ చేసి తెరపై చూపించిన విధానంపై కూడా పెద్దగా దృష్టి పెట్టారనిపించదు.

ఈ పాత్ర కోసం మోహన్ బాబు లాంటి ఆర్టిస్ట్ ని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ తీసుకున్నప్పుడు ఆ పాత్రకు కాస్త వెయిటేజ్ ఇచ్చి ఉంటే బాగుండేది. కనీసం తెలుగు ప్రేక్షకుల కోసమైనా అలా చేయాల్సింది. సినిమాలో తన పాత్రకు ప్రాముఖ్యత లేదని భావించే మోహన్ బాబు కూడా ఈ సినిమాను పట్టించుకోలేదని.. కావాలనే సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నారని టాక్. సింపుల్ గా ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేసి ఊరుకున్నారు. ఇక అమెజాన్ లో విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Click Here For ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus