Mohanlal And Mammotty: ఒకే రోజు ప్రారంభమైన రెండు క్రేజీ కాంబినేషన్‌లు.. ఇద్దరు స్టార్‌లు కేకబ్బా
- January 24, 2026 / 05:18 PM ISTByFilmy Focus Desk
అగ్ర హీరోల సినిమాలు మొదలు కావడం ఎప్పుడూ ఆసక్తే. అందులో సీనియర్ అగ్ర హీరోల సినిమాలు అయితే ఇంకా ఆసక్తి. అలాంటిది ఇద్దరు సీనియర్ అగ్ర హీరోల సినిమాలు ఒకే రోజు మొదలయ్యాయంటే పరిస్థితి ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు అదే వైబ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు మాలీవుడ్ జనాలు. ఎందుకంటే మలయాళ సినిమా పరిశ్రమలో శుక్రవారం నాడు రెండు పెద్ద, ఆసక్తికర ప్రాజెక్ట్‌లు అనౌన్స్ అయ్యాయి. ఆ హీరోలే మమ్ముట్టి, మోహన్ లాల్.
Mohanlal And Mammotty
వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తూనే.. వాటిలో వైవిధ్యం ప్రదర్శిస్తూ తగ్గేదే లే అనిపిస్తున్నారు మోహన్ లాల్, మమ్ముట్టి. ఇప్పుడు వీరిద్దరూ ఒకే రోజు రెండు వేర్వేరు సినిమాలను ప్రారంభించారు. అందులో ఒకటి హిట్ కాంబినేషన్ రిపీట్ కాగా, రెండో 30 ఏళ్ల తర్వాత కాంబో రిపీట్. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ల గురించి మలయాళ సినిమా పరిశ్రమలో మాట్లాడుకుంటున్నారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో ‘పాదయాత్ర’ అనే సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. సీనియర్ దర్శకుడు అడూర్ గోపాలకృష్ణన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో ‘అనంతరం’, ‘మథిలుకళ్’, ‘విధేయన్’ సినిమాలు వచ్చి విజయాలు, పురస్కారాలు అందుకున్నాయి.

2025లో ‘తుడరుమ్’ లాంటి భారీ విజయం ఇచ్చిన దర్శకుడు తరుణ్ మూర్తితో ఇంకో సినిమాను చేయబోతున్నారు. గతేడాది వచ్చిన ‘తుడరుమ్’ అత్యధిక వసూలు (దాదాపు రూ.235 కోట్లు) చేసిన మూడో మలయాళ సినిమాగా రికార్డు నెలకొల్పిన విసయం తెలిసిందే. ఇప్పుడు తరుణ్ దర్శకత్వంలోనే కొత్త సినిమా అనౌన్స్ చేశారు.

ఇక 2025లో మోహన్‌లాల్ ‘తుడరుమ్’తోపాటు ‘ఎల్2: ఎంపురాన్’, ‘కన్నప్ప’, ‘హృదయపూర్వం’, ‘వృషభ’లో మోహన్‌లాల్ కనిపించారు. ‘దృశ్యం 3’, ‘పేట్రియాట్’ నిర్మాణానంత కార్యక్రమాల్లో ఉన్నాయి. ఇక మమ్ముట్టి విషయానికొస్తే.. ‘డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్’, ‘బజూక’, ‘కలాంకావల్’ లాంటి సినిమాలు చేశారు.












