ఇద్దరు స్టార్ హీరోల కుటుంబాలకు బాగా క్లోజ్.. నాలుగేళ్లుగా సినిమా లేదు.. ఏమైందబ్బా?
- January 24, 2026 / 04:39 PM ISTByFilmy Focus Desk
ఆ దర్శకుడు చేసినవి నాలుగు సినిమాలు. అందులో మూడు సినిమాలు మంచి విజయాన్నే అందుకున్నాయి. ఆ మూడు సినిమాలు ఒకే సీనియర్ స్టార్ హీరో కుటుంబానికి చెందిన హీరోలతోనే తెరకెక్కించారు. ఇక మరో సీనియర్ స్టార్ హీరోకు ఆయన, ఆయన ఫ్యామిలీ బాగా క్లోజ్. ఇలాంటి దర్శకుడు నాలుగేళ్లుగా సినిమాలు చేయకుండా ఖాళీగా ఉన్నారు అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఉన్నారు. ఆయనే కల్యాణ్ కృష్ణ కురసాల. ఒకప్పుడు పొంగల్ స్టార్ అని పేరు తెచ్చుకున్న ఆయన ఏమైందో పెద్ద గ్యాపే ఇచ్చారు.
Kalyan Krishna Kurasala
అక్కినేని నాగార్జునకు ‘సోగ్గాడే చిన్ని నాయనా’, నాగచైతన్యకు ‘బంగార్రాజు’, ‘రారండోయ్ వేడుక చేద్దాం’ లాంటి సాలిడ్ హిట్లు అందించిన దర్శకుడు కల్యాణ్ కృష్ణ. మధ్యలో రవితేజతో ‘నేల టికెట్’ అనే సినిమా చేసినా అది సరైన ఫలితం అందుకోలేదు. అయితే ఆఖరిగా 2022లో ‘బంగార్రాజు’ అనే సినిమా చేశారు. అప్పటి నుండి మళ్లీ సినిమాలు చేయలేదు. ఆ సమయంలో చిరంజీవితో ఓ సినిమా చేస్తారు అని టాక్ వచ్చింది. అదో రీమేక్ అని కూడా చెప్పారు. అదైతే అవ్వలేదు.

ఆ సినిమా పనులు ఆగిపోయిన తర్వాత తిరిగి నాగార్జునతోనే సినిమా చేస్తారు అని టాక్ నడిచింది. కొన్ని నెలల పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌లో కల్యాణ్ కృష్ణ కథను డెవలప్ చేసే పనిలోనే ఉన్నారు. కానీ ఏమైందో ఏమో ఈ మధ్య ఆ పనులు కూడా కావడం లేదు. ఆయన అనుకుంటే ఇటు మెగా హీరోల్లో, అటు అక్కినేని హీరోల్లో ఇంకా లేదంటే రవితేజ.. ఇలా ఎవరైనా సినిమా చేస్తారు. కానీ ఏమైందో మరి సినిమాలు అయితే చేయడం లేదు.
కల్యాణ్ కృష్ణ లాంటి అగ్ర హీరోలను హ్యాండిల్ చేస్తూ, ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేసే దర్శకుడు టాలీవుడ్‌కి ఇప్పుడు చాలా అవసరం. చూద్దాం 2026లో అయినా కొత్త సినిమాను అనౌన్స్ చేస్తారేమో.













