Mohanlal, Rajinikanth: ‘జైలర్‌’ సినిమా అంతకుమించి అనేలా మారుస్తున్నారుగా!

భారీ తారగణం అని అంటుంటారు కదా.. ఎలా ఉంటుంది అని డౌట్‌ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అయితే ‘జైలర్‌’ సినిమా కాస్ట్‌ అండ్‌ క్రూని చూడండి. ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అదేంటి.. అనుకుంటున్నారా? ఆ సినిమాలో నటిస్తున్నవాళ్లు అంటూ బయటకు వస్తున్న పేర్లు, పుకార్లు చూస్తుంటే అదిరిపోయే కాంబినేషన్లు సినిమాలో కనిపిస్తాయి. నాటి నాయికలు, నేటి నాయికల్ని సినిమాలోకి తీసుకున్ దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌.. ఇప్పుడు మరో గ్రేట్‌ యాక్టర్‌ యాడ్‌ అవుతున్నారు.

రజనీకాంత్‌ మరోసారి ముత్తుగా చూపించబోతున్న చిత్రం ‘జైలర్‌’. ‘బీస్ట్‌’ సినిమాతో విజయం అందుకోకపోయినా.. స్టార్‌ హీరో సినిమా అంటే ఇదీ అనేలా తీశారు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌. తమిళనాట అందరూ ఇతనిని నెల్సా అని పిలుచుకుంటారు. హీరోకు బాడీ లాంగ్వేజ్‌, క్యారెక్టరైజేషన్‌కి తగ్గట్టుగా సినిమాలు తీయడం నెల్సా స్పెషాలిటీ. ఇప్పుడు రజనీకాంత్‌తో కూడా అలాంటి సినిమానే తీస్తున్నారు అని టాక్‌. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం గత కొన్ని రోజులుగా టీమ్‌ వెతుకులాడుతోంది.

కనిపించేది కాసేపే అయినా.. సినిమాలో చాల స్పెషల్‌ క్యారెక్టర్‌ అదట. దీంతో ఆ పాత్ర కోసం అగ్ర నటుడినే తీసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ను సంప్రదించారు అని టాక్‌. దానికి ఆయన నుండి కూడా ‘యస్‌’ వచ్చింది అని అంటున్నారు. త్వరలో లాలెటన్‌ ‘జైలర్‌’ సెట్స్‌లో అడుగుపెడతారని కోడంబాక్కం వర్గాల సమాచారం. ‘జైలర్‌’ సినిమాను సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. ఇందులో రజనీకాంత్‌ ముత్తువేల్‌ పాండియన్‌గా కనిపించబోతున్నాడు.

శివ్‌ రాజ్‌కుమార్, రమ్యకృష్ణ, త్రిష, ప్రియాంక అరుళ్‌ మోహన్‌, యోగిబాబు తదితరులు ఇతర పాత్రధారులు. అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాను తమిళనాడు కొత్త సంవత్సరం సందర్భంగా విడుదల చేస్తున్నారు. సినిమాను ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇప్పటికే టీమ్‌ అనౌన్స్‌ చేసింది. మరి రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న మాస్‌ కమర్షియల్‌ హిట్‌ ఈ సినిమా ఇస్తుందా అనేది చూడాలి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus