అభిజిత్ ఫ్యాన్స్ పై మోనాల్ ఫైర్!

బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న నటి మోనాల్ హౌస్ ఉన్నన్ని రోజులు తన గ్లామర్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. పద్నాలుగో వారంలో ఆమె హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. హౌస్ నుండి బయటకి వచ్చిన ఆమె పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో జోర్దార్ సుజాతకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి మాట్లాడింది మోనాల్. ఓ వీకెండ్ లో డీప్ నెక్ డ్రెస్ వేసుకుంటే తనను దారుణంగా ట్రోల్ చేశారని బాధ పడింది. ఆరోజు తన ఆరోగ్యం బాగాలేనప్పటికీ తలకు నూనె పెట్టుకొని మేకప్ లేకుండా అలానే కూర్చున్నానని.. ఆ విషయాలేవీ పట్టించుకోకుండా తనను ట్రోల్ చేశారని బాధ పడింది.

ఇక తన సోదరి హేమాలిని ట్రోల్ చేసిన విషయాన్ని మోనాల్ ప్రస్తావించింది. హేమాలి.. అభిజిత్ గురించి చెడుగా మాట్లాడకపోయినా.. ఆమెని ఇష్టమొచ్చినట్లు నిందించారని మండిపడింది. హేమాలి హౌస్ లోకి వచ్చినప్పుడు అభిజిత్ తో వెనుక మాట్లాడకుండా నేరుగా మాట్లాడమని సలహా ఇచ్చిందని.. అంతకముందు అభిజిత్ కొన్నిసార్లు అలా వెనకాల మాట్లాడాడు కాబట్టే హేమాలి అలా చెప్పిందని.. అందులో ఎలాంటి తప్పు లేదని చెప్పింది. హేమాలి చెప్పిన విధానం స్ట్రాంగ్ గా ఉండొచ్చు కానీ అభిజిత్ గురించి చెడుగా ఏం చెప్పలేదని వెల్లడించింది.

అయినప్పటికీ అభిజిత్ ఫ్యాన్స్ హేమాలిని టార్గెట్ చేస్తూ నీచంగా కామెంట్స్ పెట్టి.. చంపుతామని బెదిరించారని.. ఈ విషయంలో హేమాలి చాలా బాధపడినట్లు మోనాల్ చెప్పుకొచ్చింది. అందుకే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని తాను సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొంది. తన సోదరిని ట్రోల్ చేసినందుకు అభిజిత్ ఫ్యాన్స్ పై ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేసింది.


Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus