మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన మోనాల్ గుజ్జర్, వరుస ఆఫర్లు

అల్లరి నరేష్ కి హీరోగా చెప్పుకోవడానికి మిగిలిన ఏకైక సూపర్ హిట్ చిత్రం ‘సుడిగాడు”తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది గుజరాతీ బ్యూటీ మోనాల్ గుజ్జర్. ఆ తర్వాత నరేష్ తో మరికొన్ని సినినాలు, చిన్నాపెద్దా కలిపి మొత్తం 10 తెలుగు సినిమాలు చేసింది కానీ.. ఆశించిన స్థాయి గుర్తింపు మాత్రం రాలేదు. దాంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నించి అక్కడ కూడా ఛాన్స్ లు దొరక్కపోవడంతో సైలెంట్ అయిపొయింది.

అయితే.. ఎక్కడ్నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో తెలియదు కానీ.. ఉన్నట్లుండి బిగ్ బాస్ సీజన్ 4లో ప్రత్యక్షమైంది మోనాల్. సరిగా ఆడకపోయినా కేవలం గ్లామర్ & షోలో లవ్ స్టోరీస్ కోసం ఆమెను ఇప్పటిదాకా నెట్టుకొచ్చారు. ఇక చివరివారం కావడంతో ఓటింగ్స్ పర్శంటేజ్ లేకపోవడంతో ఆమెను ఎలిమినేటి చేశారు. ఇప్పుడు అమ్మడికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేసింది. ఆమెకు పొలోమని ఎంక్వైరీలు వస్తున్నాయి. ఆల్రెడీ ఒక రెండు సినిమాలు సైన్ చేయడం కూడా జరిగిపోయిందట.

అలాగే కొన్ని వెబ్ సిరీస్ లు, టీవీ షోలు కూడా సైన్ చేసిందట. వాటి వివరాలన్నీ త్వరలోనే వెల్లడిస్తుందట మోనాల్. ప్రస్తుతానికి కొన్ని రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతుంది మోనాల్. మరి ఈ క్రేజ్ ను ఆమె ఎలా వినియోగించుకుంటుందో చూడాలి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60


Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus