అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ‘జీఏ2 పిక్చర్స్’ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 15న(రేపు) విడుదల కాబోతుంది.టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం… ఇటీవల విడుదలైన లెహరాయి పాట చార్ట్ బస్టర్ గా నిలవడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. దాంతో ఈ చిత్రానికి బిజినెస్ కూడా బాగా జరిగింది. కచ్చితంగా ఈసారి అఖిల్ హిట్టు కొట్టడం గ్యారెంటీ అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
అయితే బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేయాలో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 6.50 cr |
సీడెడ్ | 2.48 cr |
ఉత్తరాంధ్ర | 2.55 cr |
ఈస్ట్ | 1.78 cr |
వెస్ట్ | 1.44 cr |
గుంటూరు | 1.80 cr |
కృష్ణా | 1.48 cr |
నెల్లూరు | 0.77 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 18.80 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 2.11 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 20.91 cr |
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రానికి రూ.20.91 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.21 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఏపీలో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కాబట్టి… ఈ చిత్రానికి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మరో పక్క ‘మహాసముద్రం’ వంటి క్రేజీ సినిమా కూడా పోటీగా ఉంది.. మరి దాని పోటీని తట్టుకుని ఈ చిత్రం ఎంత వరకు నిలబడుతుందో చూడాలి.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు