Prabhas, Pooja Hegde: రాధేశ్యామ్ లో హార్ట్ టచింగ్ ఎపిసోడ్!

రెబల్ స్టార్ ప్రభాస్ గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్ సినిమా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. సాహో అనంతరం డార్లింగ్ ప్రభాస్ మళ్ళీ బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు. ఇక ఆ సినిమాకు జరిగిన పొరపాట్లు రాధేశ్యామ్ లో జరగకుండా చూసుకున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమాపై ప్రస్తుతం ఇండస్ట్రీలో అనేక రకాల రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక ఎపిసోడ్ లో అయితే విక్రమ్ ఆదిత్య, ప్రేరణ మధ్యలో వచ్చే ఎమోషనల్ లవ్ ట్రాక్ గుండెల్ని పిండేస్తుందట.

పూజా హెగ్డే క్యారెక్టర్ బ్ఒక సన్నివేశంలో చనిపోతుందట. ఇక వారి తరువాత జన్మలో కాలంతో పోటీ పడుతూ ఎలా కలుసుకున్నారు అనే పాయింట్ ఎంతో ఆకట్టుకుంటుందట. రెబల్ స్టార్ మునుపెన్నడూ లేనంత ఎమోషనల్ లవ్ ట్రాక్ తో మెప్పిస్తాడాని అంటున్నారు. ఇక ఈ లవ్ జర్నీలో ప్రతి ఒక్కరు కూడా మైమరిచిపోయేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి.

ఇక సినిమాలో సముద్రంలో వచ్చే ఎపిసోడ్ కూడా అద్బుతంగా ఉంటుందట. ప్రభాస్ హీరోయిజం హైలెట్ అయ్యేలా దర్శకుడు ఆ సన్నివేశాలను అద్భుతంగా డిజైన్ చేసినట్లు సమాచారం. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus