Hero Nani: ‘శ్యామ్‌ సింగరాయ్’లో విలన్‌ ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లో ఆ మాటకొస్తే మొత్తం సౌత్‌ సహజనటిగా పేరు తెచ్చుకుంది సాయిపల్లవి. అందుకే వైవిధ్యమైన పాత్రలు వస్తున్నాయి, ఆమె కూడా అలాంటి పాత్రలను ఎంచుకుంటూ అందరినీ మెప్పిస్తోంది. మధ్య తరగతి అమ్మాయి, విలేజ్‌ గర్ల్‌, మంచి ప్రియురాలు ఇలా చాలా రకాల పాత్రలు చేస్తూ వచ్చింది సాయిపల్లవి. అయితే ఇప్పుడు తన నటనలో మరో వెరైటీని చూపించబోతోందట సాయిపల్లవి. నాని హీరోగా తెరకెక్కుతున్న ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో ఇద్దరు హీరోయిన్లున్న విషయం తెలిసిందే.

ఒకరు సాయిపల్లవి అయితే, ఇంకొకరు కృతి శెట్టి. అయితే ఇందులో సాయిపల్లవి పాత్ర చాలా కొత్తగా ఉంటుందని టాక్‌. బెంగాళీ బేస్డ్‌ అమ్మాయిగా కనిపిస్తూనే విలనిజం కూడా చూపిస్తోందని తెలుస్తోంది. అయితే సినిమా అంతటా అలానే ఉంటుందా… లేదా ఒక యాంగిల్‌లో మాత్రమే విలన్‌గా చూపిస్తారో తెలియాల్సి ఉంది. టాలీవుడ్‌లో హీరోయిన్లు విలన్‌గా నటించడం చాలా అరుదు. గతంలో ఒకరిద్దరు నాయికలు ఇలా విలన్‌గా మారినా…

పూర్తిస్థాయిలో విలన్‌గా నటించింది లేదు. మరిప్పుడు సాయిపల్లవి ఏం చేస్తుందో చూడాలి. సినిమా దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్‌ ఇలాంటి సినిమాలు, కథలు, పాత్ర చిత్రణలు చేయడంలో సిద్ధహస్తుడు. మరి ఇప్పుడు సాయిపల్లవిని విలన్‌గా ఎలా చూపిస్తాడో చూడాలి.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus