సూపర్ స్టార్ కృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి..!

  • November 15, 2022 / 12:23 PM IST

నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ గారు కన్నుమూశారు. నవంబర్ 15 ఉదయం 4:09 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఉదయాన్నే లేవగానే కృష్ణ గారు ఇకలేరు అనే మాటతో అందరూ ఉలిక్కి పడ్డారు.. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి, తెలుగు జాతికి వారి మరణం తీరని లోటు.. కృష్ణ గారికి గుండెపోటు రావడంతో.. ఆదివారం (13 నవంబర్) తెల్లవారు జామున గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో కోడలు నమ్రత అడ్మిట్ చేశారు.. 8 మంది ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయనకు చికిత్సనందించారు కానీ,

కిడ్నీతోపాటు పలు అవయవాలు కూడా పని చెయ్యకపోవడంతో చివరి వరకు పోరాడి.. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.. సినీ పరిశ్రమ ఓ పెద్దదిక్కుని కోల్పోయిందంటూ ప్రేక్షకలోకం షాక్‌కి గురైంది. కృష్ణ స్వస్థలం బుర్రిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. తమ అభిమాన నటుడిని, మంచి మనసున్న వ్యక్తిని కోల్పోయామంటూ కన్నీరుమున్నీరవుతున్నారు సన్నిహితులు.. ఇక కృష్ణ గారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది..ఈ ఏడాది జనవరిలో అన్నయ్య రమేష్ బాబు, కొద్దిరోజుల క్రితం తల్లి ఇందిరా దేవి, ఇప్పుడు నాన్నగారు పోవడం అనేది మహేష్ బాబుకి తీర్చలేని, పూడ్చలేని లోటు..

సూపర్ స్టార్ కృష్ణ గారి మృతికి సినీ, రాజకీయ వర్గాలవారు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సూపర్ స్టార్ రజినీ కాంత్, విశ్వనటుడు కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, సమంత, రవితేజ,

శ్రీను వైట్ల, జగపతి బాబు, అనిల్ రావిపూడి, సునీల్, వెన్నెల కిశోర్, థమన్, దేవి శ్రీ ప్రసాద్, శరత్ కుమార్, శ్రీకాంత్, సిమ్రాన్, అనుష్క, కార్తి, పూజా హెగ్డే, డింపుల్ హయతి ఇలా పలురంగాలకు చెందిన టెక్నీషియన్లంతా బాధాతప్త హృదయాలతో కృష్ణగారికి నివాళులర్పిస్తున్నారు. నిజంగా మహేష్ బాబుకి ఈ ఏడాది తీవ్ర విషాదాన్ని మిగిల్చింది, భగవంతుడు ఆయనకు ధైర్యాన్నివ్వాలని కోరుకుంటున్నారు..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus