Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » సినిమా టైటిల్లో ఆకట్టుకున్న చిరంజీవి స్టైల్ లోగో

సినిమా టైటిల్లో ఆకట్టుకున్న చిరంజీవి స్టైల్ లోగో

  • January 2, 2017 / 02:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమా టైటిల్లో ఆకట్టుకున్న చిరంజీవి స్టైల్ లోగో

సినిమాల టైటిల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటినుంచో ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాల పేర్ల విషయంలో చాలా కసరత్తు జరిగేవి. పేరు ఒకే చేయడమే కాదు.. ఆ పేరు కథను ప్రతిబింభించేలా ఉండాలని శ్రద్ధ తీసుకునేవారు. కొన్నింటిలో అయితే చిరు లుక్ ని కూడా టైటిల్ ల్లోనే మిక్స్ చేశారు. ఆ విధంగా డిజైన్ తో వచ్చిన అనేక చిత్రాలు హిట్ సాధించాయి. అలా అభిమానులను ఆకర్షించిన చిరు స్టైల్ లోగో టైటిల్స్ పై ఫోకస్…

ఖైదీKhaidiచిరంజీవి సినీ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం ఖైదీ. దీంతో చిరు కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. రివేంజ్ స్టోరీ తో తెరకెక్కిన ఈ మూవీలో బ్లాక్ డ్రస్ యువతను బాగా ఆకర్షించింది. అదే లుక్ ని ఖైదీ టైటిల్ ల్లో ఉంచారు. ఇలా టైటిల్ ల్లో స్టిల్ ఉండేలా చిరు 1982 నుంచే మొదలెట్టారు.

జేబు దొంగJebu dongaకోదండరామి రెడ్డి, చిరంజీవి కాంబినేషన్ లో అనేక హిట్ చిత్రాలు వచ్చాయి. అందులో జేబు దొంగ అన్ని వర్గాల ప్రజలను అలరించింది. ఈ సినిమా టైటిల్లో చిరు ఒక ఆయుధం పట్టుకొని నిలబడి ఉంటారు. స్పష్టంగా చిరు మొహం కనిపించక పోయినా సస్పెన్స్ ని క్రియేట్ చేశారు.

యముడికి మొగుడుYamudiki Moguduయమలోక అధిపతిని ముప్పుతిప్పలుపెట్టే పాత్రలో చిరు మెప్పించిన సినిమా యముడికి మొగుడు. ఈ చిత్రాన్ని రవిరాజా పినిశెట్టి ఆద్యంతం అలరించేలా తెరకెక్కించారు. ఈ మూవీ టైటిల్ లో చిరంజీవి ఒంటరిగా ఉండే స్టిల్ తో పాటు హీరోయిన్స్ తో ఉన్న స్టిల్స్ కూడా ఉంచారు.

స్టేట్ రౌడీState Rowdyరాష్ట్రంలోని రౌడీల భరతం పట్టేందుకు రౌడీగా మారిన యువకుని పాత్రలో చిరు కనిపిస్తే.. ఫ్యాన్స్ మాత్రం ఆయన నటనకు బ్రహ్మరధం పట్టారు. సూపర్ హిట్ చేశారు. బి. గోపాల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా టైటిల్ రూపకల్పనే చాలా క్రియేటివ్ గా ఉంటుంది. చార్మినార్ పైన నిలబడిన చిరు తో ఉన్న లోగో అదరహో అనిపించింది.

బావగారు బాగున్నారా !Bavagaru Bagunnaraమెగాస్టార్ రొమాంటిక్ కామెడీ మూవీ బావగారు బాగున్నారా చిత్రం చెప్పగానే మనందరికీ ముందుగా గుర్తు వచ్చేది అందులో చిరు వేసుకున్న చెక్స్ ప్యాయింట్. ఆ ప్యాయింట్ తో చిరంజీవి నైస్ గా కూర్చున్న ఫోజు ని సినిమా టైటిల్ లో ఉంచి హిట్ కొట్టారు.

చూడాలని ఉందిChudalani Undhiగుణశేఖర్, చిరంజీవి కలయికలో వచ్చిన తొలి మూవీ “చూడాలని ఉంది”. మెగాస్టార్ యాక్షన్ సీన్స్, లవ్ ట్రాక్ లు ఈ చిత్రాన్ని హిట్ దిశగా నడిపించాయి. ఇందులోని “యమహా నగరి” పాటలో చిరు స్టిల్ ని ఈ మూవీ టైటిల్ ముందు ఉంచి ఆకర్షణ తీసుకొచ్చారు.

రౌడీ అల్లుడుRowdy alluduమాస్ ప్రేక్షకుల మనసుదోచుకున్న చిరంజీవి చిత్రం రౌడీ అల్లుడు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు మెగా ఫోన్ నుంచి వచ్చిన మరో బ్లాక్ బస్టర్. ఆటోడ్రైవర్ జానీ, బిజినెస్ మాన్ కళ్యాణ్ గా చిరు ద్విపాత్రాభినయం చేసి కేక పుట్టించారు. ఈ చిత్రం టైటిల్ లోగోలో నోటీలో సిగరెట్, చేతిలో మందు గ్లాసుపట్టుకుని మాస్ లుక్ తో ఉన్న చిరుని చూడవచ్చు.

డాడీDaddyతండ్రి కూతుళ్ల అనుబంధంపై అల్లుకున్న కథ డాడీ. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలోని కథాంశం తెలిసేలా పాపతో నడుచుకుంటూ వస్తున్న చిరు చిత్రాన్ని టైటిల్లో పెట్టారు. ఈ చిత్రం మహిళా ప్రేక్షకులతో కన్నీరు పెట్టించింది.

మృగరాజుMrugarajuమెగాస్టార్ స్టార్ ఇమేజ్ కి దూరంగా ఎంచుకున్న సినిమా మృగరాజు. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ టైటిల్లో చిరంజీవి సింహాన్ని వేటాడే ఫోజులో కనిపిస్తారు. మరో వైపు సింహం ఉంటుంది. ఇలా టైటిల్ ల్లోనే కథను, ప్రధాన పాత్రను తీరును వివరించారు.

‘ఇంద్ర’Indraచిరు చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన వాటిలో ‘ఇంద్ర’ ఒకటి. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ టైటిల్ ల్లోనూ చిరు డ్యాన్సింగ్ ఫోజు ఉంటుంది. కాశీలో ఉన్న లుక్ తో లోగో ఉంటుంది. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో తెలుగు ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాసింది.

శంకర్ దాదా ఎంబీబీస్Shankar Dada MBBSదాదా గా ఎదిగిన వ్యక్తి డాక్టర్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో చాలా ఫన్నీగా జయంత్ సి. పరాంజీ… శంకర్ దాదా ఎంబీబీస్ సినిమాలో చూపించారు. బాలీవుడ్ మూవీ మున్నాభాయ్ ఎంబీబీస్ కి ఇది రీమేక్ అయినప్పటికీ ఇందులో చిరు తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టారు. ఈ సినిమా టైటిల్ లో చేతిలో గన్, మేడలో స్కెతస్కోప్ తో స్టైల్ గా నిల్చొని ఉన్న చిరు లోగో సినిమాపై ఆసక్తిని పెంచడానికి ఓ కారణమయింది.

జై చిరంజీవJai Chiranjeevaమేన కోడలిని చంపిన వారిని అంతమొందించే మేనమామ కథతో రూపొందిన చిత్రం జై చిరంజీవ. విజయ్ భాస్కర్ డైరక్షన్లో వచ్చిన ఈ సినిమా యాక్షన్, ఎమోషన్ తో చిరంజీవి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఈ మూవీ టైటిల్లో చిరు సాంగ్ లో ఉండే ఫోజు ఉంటుంది.

శంకర్ దాదా జిందాబాద్Shankar Dada Zindabadఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ దర్శకత్వంలో చిరంజీవి నటించిన చిత్రం శంకర్ దాదా జిందాబాద్. 2007 లో వచ్చిన ఈ చిత్రంలో గాంధేయవాదిగా చిరు అలరించారు. ఈ చిత్రం టైటిల్లో మెగాస్టార్ చాలా స్టైల్ గా ఉంటారు. ఆ లుక్ సినిమాలోని ఓ పాట నుంచి తీసుకున్నారు.

ఖైదీ నంబర్ 150Khaidi No 150మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నప్పటికీ తనకి కలిసి వచ్చిన సెంటిమెంట్ ని ఫాలో అయ్యారు. ఖైదీ నంబర్ 150 మూవీ టైటిల్ ల్లో చిరు నడుచుకుంటూ వస్తున్న లోగో పెట్టించారు. సినిమాలో కీలక సన్నివేశంలోనిది ఈ స్టిల్. ఫస్ట్ లుక్ నాడు రివీల్ అయిన ఈ టైటిల్ అభిమానులకు చాలా చేరువైంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A. Kodandarami Reddy About Chiranjeevi
  • #Bavagaru Bagunnara Movie
  • #Chiranjeevi Dialogues
  • #Chiranjeevi movies
  • #Chudalani Undhi Movie

Also Read

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

related news

Chiranjeevi: చిరు సినిమాపై ఒకేసారి రెండు అప్‌డేట్స్‌ ఇవ్వనున్న అనిల్ రావిపూడి.. అప్పుడే?

Chiranjeevi: చిరు సినిమాపై ఒకేసారి రెండు అప్‌డేట్స్‌ ఇవ్వనున్న అనిల్ రావిపూడి.. అప్పుడే?

trending news

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

4 hours ago
War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

4 hours ago
Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

6 hours ago
పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

7 hours ago
Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

11 hours ago

latest news

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

7 hours ago
Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

12 hours ago
Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

23 hours ago
OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

1 day ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version