ఎన్నికల టైం దగ్గరపడుతోంది. ఇలాంటి టైంలో పొలిటికల్ సినిమాలకి మంచి డిమాండ్ ఏర్పడుతుంది. సోషల్ మీడియాలో కూడా వీటిపైనే ఓ రేంజ్లో డిస్కషన్స్ జరుగుతుంటాయి. గతంలో అంటే 2014 ఎన్నికల టైంలో ‘లెజెండ్’ సినిమా టీడీపీ పార్టీ నేతల్లో మంచి జోష్ నింపినట్టయ్యింది. అందుకే ఎన్నికల టైంలో ఇలాంటి సినిమాలు వస్తే బాగుంటుంది అనే అభిప్రాయం జనాల్లో కూడా ఉంది. 2019 ఎన్నికల టైంలో ‘యాత్ర ‘ సినిమా వైసీపీ పార్టీ నేతల్లో మంచి జోష్ నింపినట్టయ్యింది.
అందుకే 2024 లో కూడా కొన్ని పార్టీలు తమ అనుకూలంగా సినిమాలు వస్తే బాగుణ్ణు అంటూ కోరుకుంటున్నాయి. ‘వైసిపి’ కి అనుకూలంగా రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే మహి వి రాఘవ్ కూడా ‘యాత్ర 2 ‘ చేస్తున్నాడు. పనిలో పనిగా బోయపాటి కూడా టీడీపీకి అనుకూలంగా బాలయ్యతో ఓ సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు వర్కౌట్ అయ్యేలా లేదు.
అందుకే హీరో నారా రోహిత్ తన పెద్దనాన్న నారా చంద్రబాబు నాయుడు పార్టీ అయిన టీడీపీకి అనుకూలంగా ‘ప్రతినిధి 2’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో టీడీపీకి అనుకూలంగా చాలా అంశాలు ఉంటాయట. ‘యాత్ర 2 ‘ కంటే ముందే అంటే జనవరి 25, 2024 న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ రెండు సినిమాలు (Movies) ఆయా పార్టీలకి ఎంత మైలేజ్ ను చేకూరుస్తాయి అనేది చూడాలి.