శివరాత్రికి అర్థరాత్రి స్పెషల్ షోలు వేయనున్న సినిమాలు ఏవంటే..?

తెలుగు రాష్ట్రాల్లో మరి కొద్ది రోజుల్లో శివరాత్రి సందడి మొదలు కానుంది.. ఇక శివరాత్రి అప్పుడు భక్తి శ్రద్ధలతో చేసే జాగారం సమయంలో సినిమా అనేది చక్కటి కాలక్షేపం.. అర్థరాత్రి వేళ 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు రెండేసి సినిమాలను ప్రదర్శించడం అనేది ఎప్పటినుండో జరుగుతూ వస్తోంది. అప్పట్లో ఒక టికెట్ మీద రెండు షోలు చూడడం అన్నది మర్చిపోలేని అనుభవం.. ఇక హైదరాబాద్‌లోనూ పలు ఏరియాల్లో ఈ అర్థరాత్రి ఆటలు వేస్తుంటారు.

కట్ చేస్తే.. ఈసారి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఎప్పుడూ లేనంత హంగామా నెలకొనబోతోంది.. స్టార్ హీరోల ఫ్యాన్స్ కోరిక మేరకు దాదాపు క్రాస్ రోడ్స్‌లోని సింగిల్ స్క్రీన్స్ అన్నిటిలోనూ ప్రత్యేక ప్రదర్శనలు వేయనున్నారు.. ఏకంగా అరడజను సినిమాలు షెడ్యూల్ చేసుకుంటున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. ఇప్పటికైతే బాలయ్య ‘అఖండ’, జూనియర్ ఎన్టీఆర్ ‘టెంపర్’ మూవీస్ కన్ఫామ్ అయిపోయాయి.. టికెట్స్ బుక్ మై షోలో అందుబాటులో ఉన్నాయి..

‘అఖండ’ అర్థరాత్రి 12:15 గంటలకు సుదర్శన్ 35MMలో, అదే సమయానికి దేవి 70MMలో ‘టెంపర్’ స్పెషల్ షోలు పడుతున్నాయి.. ‘టెంపర్’ ఫిబ్రవరి 13 నాటికి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానుల కోరిక మేరకు ప్రదర్శించనున్నారు. ఆల్ రెడీ రన్నింగ్‌లో మెగాస్టార్ చిరంజీవి – రవితేజల మల్టీస్టారర్ ‘వాల్తేరు వీరయ్య’ కూడా వేస్తున్నారు.. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రెబల్’,

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్‌ల పాన్ ఇండియా సెన్సేషన్ ‘పుష్ప : ది రైజ్’ ఇప్పటి వరకు దాదాపుగా ఖరారయ్యాయి.. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా షో కావాలని పట్టు పడుతున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ స్పెషల్ షో కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పటికైతే ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.. సంధ్య 35MM & 70MM, శాంతి, సప్తగిరి, ఏషియన్ తారకరామలోనూ షోలు వెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus