సాధారణంగా వారానికి నాలుగైదు సినిమాలు రిలీజవుతుంటేనే మూవీల్ లవర్స్ కి పండగ అలాంటిది ఏకంగా ఈవారం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషా సినిమాలతో కలిపి 11 సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే.. అందులో పేర్కొనదగ్గ సినిమా మాత్రం “ఈ నగరానికి ఏమైంది?” మాత్రమే. “పెళ్లి చూపులు” అనంతరం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తెరకెక్కించిన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ కూడా వస్తాయి. ఇది కాకుండా నందు హీరోగా తెరకెక్కిన “కన్నుల్లో నీ రూపమే”, షకలక శంకర్ హీరోగా తెరకెక్కిన “శంభో శంకర”, అల్లు శిరీష్ మలయాళంలో నటించిన ఓ చిత్రాన్ని “యుద్ధ భూమి” అనే పేరుతో డబ్బింగ్ చేశారు. అలాగే.. “నా లవ్ స్టోరీ, ఐపీసీ సెక్షన్ భార్యబంధు, సూపర్ స్కెచ్, సంజీవని, మిస్టర్ హోమానంద్” అనే సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ఈ తెలుగు సినిమాలతోపాటు “సంజు” అనే హిందీ చిత్రం మరియు “ఎస్కేప్ ప్లాన్ 2” అనే ఆంగ్ల చిత్రం కూడా విడుదలవుతోంది.
సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై భీభత్సమైన అంచనాలున్నాయి. “3 ఇడియట్స్, PK” చిత్రాల అనంతరం రాజ్ కుమార్ హీరాణీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతోపాటు రణబీర్ కపూర్ ట్రైలర్ & ప్రోమోస్ లో అచ్చుగుద్దినట్లు సంజయ్ దత్ లాగే ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక హాలీవుడ్ ఫిలిమ్ “ఎస్కేప్ ప్లాన్ 2” విషయానికి వస్తే.. ప్రీక్వెల్ సూపర్ హిట్ అవ్వడంతో సీక్వెల్ పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ 11 సినిమాల్లో ఏ చిత్రం విజయం సాధిస్తుందో చూడాలి.