2020 లో కరోనా కారణంగా లాక్ డౌన్ ఏర్పడింది. అందరూ హౌస్ అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. థియేటర్లు మూతపడ్డాయి.దాంతో సినీ లవర్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. కానీ లాక్ డౌన్ కు కొద్ది రోజుల ముందు ‘ఆహా’ ఓటిటి గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. పక్కా తెలుగు కంటెంట్ తో ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లాంచ్ అయ్యింది. దీంతో సినీ ప్రేక్షకులు మంచి ఫీస్ట్ దొరికినట్టు భావించారు. పలు వెబ్ సిరీస్ లు, డబ్బింగ్ సినిమాలతో ఆరంభం నుండీ ‘ఆహా’ ప్రేక్షకులను అలరించడం మొదలుపెట్టింది. అటు తర్వాత నుండి కంటెంట్ ఉన్న మంచి మంచి సినిమాలను నేరుగా ఓటిటిలో విడుదల చేయడం మొదలుపెట్టారు ‘ఆహా’ వారు.’సామ్ జామ్’ ‘అన్ స్టాపబుల్’ వంటి టాక్ షోలు కూడా సూపర్ సక్సెస్ సాధించాయి.
ఇందులో చాలా సినిమాలు థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేసి నేరుగా విడుదలైన సందర్భాలు కూడా ఉన్నాయి. తద్వారా ఒక్క సంవత్సరంలోనే భారీగా సబ్స్క్రైబర్స్ పెరిగారు. ప్రస్తుతం ‘ఆహా’ లీడింగ్ ఓటిటి ప్లాట్ ఫామ్ గా దూసుకుపోతుంది. ప్రతీవారం ఓ కొత్త సినిమా రిలీజ్ అవుతుంది. ఈ విషయాలను పక్కన పెట్టేసి.. ‘ఆహా’ లో నేరుగా రిలీజ్ అయిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) బ్లడీ మేరీ :
నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ నేరుగా ఏప్రిల్ 15న ‘ఆహా’ ఓటిటిలో విడుదలైంది. ‘కార్తికేయ’ ‘ప్రేమమ్’ చిత్రాల దర్శకుడు చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకుడు.
ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఫిబ్రవరి 11న నేరుగా ‘ఆహా’ ఓటిటిలో రిలీజ్ అయ్యింది. అభిమన్యు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.
రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 2021 వ సంవత్సరం డిసెంబర్ 21న నేరుగా ‘ఆహా’ లో విడుదలైంది. పవన్ సాధినేని ఈ చిత్రానికి దర్శకుడు. ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై విష్ణుప్రసాద్ తో కలిసి చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు.
సుహాస్, చాందినీ చౌదరి జంటగా నటించిన ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాని సందీప్ రాజ్ తెరకెక్కించాడు.2020 వ సంవత్సరం అక్టోబర్ 23న ఈ మూవీ నేరుగా ‘ఆహా’ లో విడుదల అయ్యింది.
‘బిగ్ బాస్’ ఫేమ్ ప్రిన్స్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ క్రైం డ్రామాగా రూపొందింది. విగ్నేష్ కౌశిక్ తెరకెక్కించిన ఈ మూవీ జనవరి 14న నేరుగా ‘ఆహా’ లో రిలీజ్ అయ్యింది.
అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీని దర్శకుడు రమేష్ రాపర్తి తెరకెక్కించాడు. 2021 వ సంవత్సరం మే 7న ఈ మూవీ నేరుగా ‘ఆహా’ లో రిలీజ్ అయ్యింది.
అలీ రెజా, నందినీ రాయ్, సనా, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీకి కరుణ కుమార్ దర్శకుడు. 2020 వ సంవత్సరం ఆగస్టు 15న ఈ మూవీ నేరుగా ‘ఆహా’ ఓటిటిలో రిలీజ్ అయ్యింది.
సిద్దు జొన్నలగడ్డ, సీరత్ కపూర్, కల్పిక గణేష్.. నటించిన ఈ మూవీని ఆదిత్య మండల డైరెక్ట్ చేసాడు. 2020 వ సంవత్సరం నవంబర్ 13న ఈ మూవీ నేరుగా ‘ఆహా’ లో రిలీజ్ అయ్యింది.
రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ మూవీని దర్శకుడు కొండా విజయ్ కుమార్ తెరకెక్కించారు. 2020 వ సంవత్సరం అక్టోబర్ 2న ఈ మూవీ నేరుగా ‘ఆహా’ లో రిలీజ్ అయ్యింది.