Mrunal Thakur: అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా…మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్!

సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి మృణాల్ ఠాకూర్. ఈ సినిమా ద్వారా ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగు హీరోల సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంటున్నారు. ఈ క్రమంలోని ఈమె తన తదుపరి చిత్రాన్ని నేచురల్ స్టార్ నానితో చేస్తున్నారు. అదేవిధంగా విజయ్ దేవరకొండతో కూడా మరో సినిమాకు కమిట్ అయ్యారు. ఈ విధంగా వరుస తెలుగు సినిమాలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరు అవ్వడం కోసం ఈమె గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అయితే తాజాగా ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. తనకు చిన్నప్పటినుంచి ఆటలు అంటే చాలా ఇష్టం అని తెలిపారు. ఎక్కువగా క్రికెట్ బాస్కెట్ బాల్ ఆడే దానిని తన సోదరుడి కారణంగా తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం ఏర్పడిందని తెలిపార. ఐదు సంవత్సరాల క్రితమే తాము బ్లూ జెర్సీ వేసుకొని స్టేడియంలో క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేసామని తెలిపారు.

అయితే అనుకోని విధంగా తనకు జెర్సీ సినిమాలో నటించే అవకాశం రావడం ఎంతో సంతోషం కలిగించిందని తెలిపారు. ఇక క్రికెట్ పరంగా తనకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టమని తెలియజేశారు. అంతేకాకుండా నటుడు సాహిద్ కపూర్ అంటే చాలా ఇష్టమని, తానే నా ఫస్ట్ క్రష్ అంటూ ఈమె తెలియజేశారు. తాము ఇండస్ట్రీలోకి రాకముందు తన ఫోటోలు ఎక్కడ కనిపించినా కూడా కట్ చేసి బుక్ లో పేస్ట్ చేసే వాళ్లమని ఇది చూసి మా ఇంట్లో వాళ్ళు తిట్టినా కూడా మా పని మేము చేసే వాళ్ళం అంటూ తెలిపారు.

అలాంటిది షాహిద్ కపూర్ తో కలిసి నాకు సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా సంతోషించాల్సిన విషయం అని తెలిపారు. తాను క్లాసికల్ డాన్సర్ అని ఈమె తెలియజేశారు. అయితే భవిష్యత్తులో తన వృత్తిని పూర్తిగా అర్థం చేసుకున్న వాడిని తాను పెళ్లి చేసుకుంటాను అంటూ ఈ సందర్భంగా తనకు (Mrunal Thakur) కాబోయే వాడి గురించి కూడా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus