Akhanda: అఖండ2.. పొలిటికల్ అంశాలను టచ్ చేయబోతున్న బోయపాటి!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు బాలయ్య. ఈ క్రమంలోనే ఈ ఏడాది వీర సింహారెడ్డి సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇందులో కాజల్ అగర్వాల్ నటి శ్రీ లీల హీరోయిన్లుగా నటించబోతున్నారు.

ఇక బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా కంటే ముందుగానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం కచ్చితంగా ఉంటుందని బోయపాటి అలాగే బాలయ్య కూడా పలు సందర్భాలలో అఖండ సినిమా సీక్వెల్ గురించి వెల్లడించారు.

ఈ క్రమంలోనే తాజాగా అఖండ 2 గురించి ఒక ఇంట్రెస్టింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా పూర్తి అయిన వెంటనే బాలకృష్ణ అఖండ 2 షూటింగ్లో పాల్గొనబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమా సీక్వెల్ మొత్తం పొలిటికల్ అంశాలను టచ్ చేసే విధంగా ఉండబోతుందని తెలుస్తుంది.

ఈ (Akhanda) సినిమాని శరవేగంగా షూటింగ్ పనులు పూర్తి చేసి వచ్చే ఎన్నికల ముందు విడుదల చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. అందుకే ఈ సినిమాని బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10 2023 వ తేదీ సినిమా గురించి ప్రకటించి ఆ రోజే పూజా కార్యక్రమాలను కూడా ప్రారంభించుకోబోతున్నారని సమాచారం.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus