Varun Tej: మొత్తానికి వరుణ్ తేజ్ మూవీకి ముహూర్తం ఫిక్స్ చేశారు..!
- March 24, 2025 / 12:27 PM ISTByPhani Kumar
వరుణ్ తేజ్ (Varun Tej) ఓ హిట్టు కొట్టి చాలా కాలమైంది. కోవిడ్ కి ముందు వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ (Gaddalakonda Ganesh) తర్వాత అతని ఖాతాలో హిట్టు పడలేదు. ‘ఎఫ్ 3’ (F3 Movie) బానే ఆడినా.. దాని ఫుల్ క్రెడిట్ మొత్తం దర్శకుడు వెంకటేష్ (Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi)..లకే చెందింది. మరోపక్క వరుణ్ తేజ్ చేసిన ‘గని’ (Ghani) ‘గాండీవధారి అర్జున'(Gandeevadhari Arjuna) ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) ‘మట్కా’ (Matka) వంటి సినిమాలు పెద్ద పెద్ద డిజాస్టర్స్ అనిపించుకున్నాయి. ఆ సినిమాలకి ఓపెనింగ్స్ కూడా రాలేదు.
Varun Tej

వరుణ్ తేజ్ సినిమా అంటే ఆడియన్స్ లో కూడా ఇంట్రెస్ట్ సన్నగిల్లింది అని ఈ సినిమాల ఫలితాలతో ప్రూవ్ అయ్యింది. అందుకే నెక్స్ట్ సినిమాతో కచ్చితంగా హిట్టు కొట్టాలని దర్శకుడు మేర్లపాక గాంధీతో (Merlapaka Gandhi) చేతులు కలిపాడు వరుణ్. ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ తో ఈ సినిమా మొదలవ్వాలి. అయితే కొద్దిరోజుల క్రితం ఈ సినిమా ఆగిపోయింది అనే చర్చ కూడా నడిచింది. కానీ అందులో నిజం లేదు అనేది లేటెస్ట్ టాక్.

ఇది ఒక హారర్ కామెడీ జోనర్ సినిమా. వరుణ్ తేజ్ గతంలో ఇలాంటి జోనర్లో సినిమా చేసింది లేదు. పైగా హర్రర్ కామెడీ సినిమాలకి మంచి డిమాండ్ ఉంటుంది. ఇక దర్శకుడు మేర్లపాక గాంధీకి ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ (Venkatadri Express)’ఎక్స్ ప్రెస్ రాజా’ (Express Raja) వంటి హిట్లు ఉన్నాయి. ‘యూవీ’ సంస్థ నిర్మించనుంది. 2 రోజుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందట. మేజర్ షూటింగ్ అంతా ఔట్ డోర్లో ఉంటుందని టాక్.












