నాలుగు సినిమాలు.. ఒక కామెడీ షో.. బిజీగా మారిన అవినాష్!

  • December 25, 2020 / 04:32 PM IST

బిగ్ బాస్ షోలో పాల్గొంటే క్రేజ్ వస్తుందని.. సినిమా ఛాన్స్ లు వస్తుంటాయని ఆశ పడుతుంటారు. కానీ అందరికీ అలా జరగదు. గత సీజన్లలో విన్నర్లుగా నిలిచిన వారికి కూడా అవకాశాలు రాక సైలెంట్ గా ఉన్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న కొందరికి మాత్రం మంచి అవకాశాలే వస్తున్నాయి. సోహైల్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. అభిజిత్ సెకండ్ ఇన్నింగ్స్ కి సైతం రూట్ క్లియర్ అయింది. ఇప్పుడు ముక్కు అవినాష్ కి కూడా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 4లో మంచి ఎంటర్టైనర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు అవినాష్. ‘జబర్దస్త్’ షోతో పాపులర్ అయిన అవినాష్.. ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ కూడా ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాడు. బిగ్ బాస్ షో ద్వారా అవినాష్ బాగానే సంపాదించాడు. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత కూడా ఆ పాపులారిటీని క్యాష్ చేసుకోగలుగుతున్నాడు. ఈ మధ్యకాలంలో అవినాష్ నాలుగు సినిమాలను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు.. ‘స్టార్ మా’లో ఓ కామెడీ షో చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాడట. ఆ షో గనుక సక్సెస్ అయితే ఇక అవినాష్ తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ‘జబర్దస్త్’ షోని వదులుకొని బిగ్ బాస్ కి వెళ్లడానికి అవినాష్ పది లక్షల రిస్క్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు దానికి రెండింతలు సంపాదించాడు. ఫ్యూచర్ లో ఇంకెన్ని ఛాన్స్ లు వస్తాయో చూడాలి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus