Amitab, Anushka: వైరల్‌ సంగతి పక్కనపెట్టండి.. మీరు చేసిందేం బాలేదు: ముంబయి పోలీసులు!

గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో ఓ వార్త తెగ వైరల్‌ అవుతోంది. ఒక వార్త అనే కదా.. ఒకే లాంటి వార్తలు రెండు వైరల్‌ అవుతున్నాయి అని చెప్పాలి. అదే స్టార్‌ నటులు బైక్‌ మీద ముంబయి నగరంలో తిరగడం. అలా అనుష్క శర్మ, అమితాబ్‌ బచ్చన్‌ బైక్‌ మీద వెళ్లడం కనిపించింది. దీంతో ఆ వీడియోలు, ఫొటోలు వైరల్‌ అయ్యాయి. అంత పెద్ద స్టార్లు అయి ఉండి, అలా బైక్‌ మీద వెళ్లడం సూపర్‌ కదా అంటూ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నాయి. అయితే ముంబయి పోలీసులు మాత్రం వేరేగా రియాక్ట్‌ అయ్యారు.

అనుష్క శర్మ తన బాడీగార్డ్‌తో కలసి బైక్‌పై వెళ్లగా, (Amitab) అమితాబ్‌ బచ్చన్ బైక్‌పై షూటింగ్ స్పాట్‌కి చేరుకున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని చూసి ఆనందించిన వాళ్లు కొందరు అయితే, మరికొందరు నెటిజన్లు కంప్లైంట్ చేయడం ప్రారంభించారు. ఇందులో ఫిర్యాదు చేసేంత ఏముంది అనుకుంటున్నారా? అందరూ చేయాల్సిన పనిని వాళ్లు చేయలేదు అనేదే ఇక్కడ విషయం. అదే ట్రాఫిక్‌, బైక్‌ రైడింగ్‌ నిబంధనలను పాటించకపోవడమే.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియోల్లో బైక్‌ డ్రైవర్‌కు, అలాగే వెనుక కూర్చున్న అమితాబ్‌ బచ్చన్‌కు హెల్మెట్ లేదని నెటిజన్లు పాయింట్‌ అవుట్‌ చేయడం ప్రారంభించారు. ముంయి పోలీసులు ఈ విషయాన్ని గమనించాలి అంటూ ట్విటర్‌ వేదికగా ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. తాజాగా ఈ విషయంపై ముంబయి పోలీసులు స్పందించారు. ఈ విషయాన్ని ట్రాఫిక్ బ్రాంచ్‌కు పంపించామని ట్విటర్‌లో నెటిజన్లకు రిప్లయ్‌ ఇచ్చారు.

అలాగే ఇటీవల బాడీగార్డుతో బైక్ రైడ్ చేసిన అనుష్క శర్మ వీడియోపైనా సోషల్‌ మీడియాలో కంప్లైంట్లు వచ్చాయి. రైడర్స్ ఇద్దరికీ హెల్మెట్స్ లేవని చాలామంది ప్రస్తావించారు. దీంతో ఈ విషయాన్ని కూడా ముంబయి ట్రాఫిక్‌ బ్రాంచ్‌కు పంపించామని ముంబయి పోలీసులు చెప్పారు. దీంతో ఈ విషయంలో ఇద్దరూ తమ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది అని చెప్పాలి. అయితే షూటింగ్‌కి ఆలస్యమవుతోందని బిగ్‌ బీ, ఇంటికి వెళ్లే దారిలో ట్రాఫిక్‌ జామ్‌ అని అనుష్క బైక్‌ రైడ్‌ని ఎంచుకున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus