లైంగిక వేధింపులపై స్పందించిన పవన్ హీరోయిన్

సినిమా పరిశ్రమలో జరిగిన లైంగిక వేధింపుల గురించి రోజుకొకరు చొప్పున తమ అనుభవాలను పంచుకుంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తో ఖుషి సినిమాలో కలిసి నటించిన ముంతాజ్ తనకి జరిగిన చేదు విషయాన్ని బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. “లైంగిక వేధింపుల బాధితుల జాబితాలో నేను కూడా ఉన్నాను. పలు సార్లు నేను లైంగికంగా బాధింపబడ్డాను. అయితే వాటిని నేను ఓపిక ఉన్నంత వరకు భరించేదాన్ని అంతకు మించి నన్ను లైంగికంగా వేదిస్తే మాత్రం సీరియస్ గా స్పందించేదాన్ని. ఒక సినిమా షూటింగ్ సమయంలో నాతో దర్శకుడు పదే పదే అసభ్యంగా ప్రవర్తించడంతో సహనం కోల్పోయి అతడిని చెప్పుతో కొట్టాను. అప్పుడు అంతా షాక్ అయ్యారు. ఘాటుగా స్పందిస్తే తప్ప లైంగిక వేధింపుల నుంచి మహిళలు బయట పడలేరు” అని ముంతాజ్ సూచించింది.

అయితే తాను మీటూ ఉద్యమంలో భాగస్వామి కానని స్పష్టం చేసింది. ” మీటూ అంటూ సెలబ్రెటీలపై ఆరోపణలు చేస్తున్న వారు వాటిని నిరూపించేందుకు సిద్ధంగా ఉండాలి. అలా లేని పక్షంలో వారు ఆరోపణలు చేయకపోవడం మంచిది. కేవలం ఆరోపించి వార్తల్లో నిలవాలని భావిస్తే అది మంచి పద్ధతి కాదు” అని ముంతాజ్ వెల్లడించింది. రీసెంట్ గా అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ తో స్టెప్పులు వేసిన ఈ బ్యూటీ తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొని ఎక్కువమంది అభిమానుల మనసులను గెలుచుకుంది. మళ్ళీ ఏ తెలుగు చిత్రంలో మెరవనుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus