సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్లో ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది ‘మురారి’ (Murari) . ‘రామ్ ప్రసాద్ (C. Ram Prasad) ఆర్ట్స్’ బ్యానర్ పై ఎన్.దేవి ప్రసాద్, రామలింగేశ్వరరావు , గోపి నందిగం (Gopi Nandigam) ..లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా శోభన్ (Sobhan) (‘బాబీ’ (Bobby) ‘వర్షం’ (Varsham) చిత్రాల దర్శకుడు) డైలాగ్స్ అందించడం విశేషంగా చెప్పుకోవాలి. 2001 ఫిబ్రవరి 17న పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. 4 వారాల వరకు ఈ సినిమాను పట్టించుకున్న వాళ్ళే లేరు.
Murari
అనూహ్యంగా ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద గట్టిగా పుంజుకుంది ఈ సినిమా. 34 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ఈ సినిమా 3 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. నటుడిగా మహేష్ బాబుని మరో మెట్టు పైకి ఎక్కించిన సినిమా ఇది. మరి నిన్న అంటే ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు నాడు ‘మురారి'(4K ) ని రీ రిలీజ్ చేయడం జరిగింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఈసారి కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసింది ‘మురారి’. ఒకసారి రీ రిలీజ్ కలెక్షన్స్ ని గమనిస్తే :