‘బాహుబలి'(సిరీస్) (Baahubali) తర్వాత ప్రభాస్ (Prabhas) రేంజ్ పూర్తిగా మారిపోయింది. గతంలో ప్రభాస్ మార్కెట్ రూ.40 కోట్లు ఉంటే.. ‘బాహుబలి’ తర్వాత అది రూ.400 కోట్లు అయ్యింది. అంటే పది రెట్లు పెరిగింది అని చెప్పాలి. ప్రభాస్ తో ఆ బడ్జెట్లో సినిమా తీస్తే.. సేఫ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ‘రాధే శ్యామ్’ సినిమా పెద్ద డిజాస్టర్ అయినా.. నిర్మాతలు నష్టపోలేదు. ‘ఆదిపురుష్’ కూడా చాలా వరకు రికవరీ సాధించింది. ఇదిలా ఉంటే.. ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) ‘ఆదిపురుష్’ (Adipurush) వంటి సినిమాలు ప్లాప్ అయినా వాటిని రిలీజ్ కి ముందు పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేశారు మేకర్స్.
అందుకే పెట్టిన బడ్జెట్ వెనక్కి రప్పించడం సులువు అయ్యింది. ఇక ఆ తర్వాత ప్రభాస్ చేసిన ‘సలార్’ (Salaar) ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సో ప్రభాస్ నెక్స్ట్ సినిమాపై సహజంగానే అంచనాలు భారీగా ఏర్పడతాయి. ‘ది రాజాసాబ్’ (The Rajasaab) విషయంలో ఫ్యాన్స్ ధీమా అయితే ఇదే. అయితే నిర్మాత ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ అధినేత అయినటువంటి టి.జి.విశ్వప్రసాద్ (T G Vishwa Prasad) ఆలోచన వేరుగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఆయన (TG Vishwa Prasad) మాట్లాడుతూ.. ‘ది రాజాసాబ్’ సినిమా ప్రభాస్ గారి గత సినిమాల్లాగే రిచ్ గా ఉంటుంది. స్కేల్ పరంగా అంటే క్యాస్టింగ్, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ హైలెవెల్లో ఉంటాయి. కానీ ‘ది రాజాసాబ్’ ఓ అండర్ డాగ్ వంటిది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక కంటెంట్ మాట్లాడుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు విశ్వప్రసాద్. సో ‘ది రాజాసాబ్’ కి పాన్ ఇండియా హడావిడి చేయకుండానే రిలీజ్ చేస్తారేమో.