Acharya Movie: ఆచార్య రీరికార్డింగ్ కు మ్యూజిక్ డైరెక్టర్ మారారా?

మరో మూడు వారాల్లో కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి, చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆచార్య మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 24వ తేదీన యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌ లో జరగనుందని సమాచారం అందుతోంది. తెలంగాణ సర్కార్ నుంచి ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి అనుమతులు లభించాయని బోగట్టా. అయితే ఈ సినిమా కొరటాల శివను తెగ టెన్షన్ పెడుతోందని ప్రచారం జరుగుతోంది.

మిర్చి సినిమా నుంచి భరత్ అనే నేను సినిమా వరకు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. అయితే ఆచార్య సినిమాకు మాత్రం మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మణిశర్మ హవా తగ్గినా ఆచార్య సినిమా నుంచి విడుదలైన లాహే లాహే, నీలాంబరి పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఆచార్య సినిమాకు మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నచ్చకపోవడంతో

కొరటాల శివ మరో మ్యూజిక్ డైరెక్టర్ కు ఆ పనులు అప్పగించారని అయితే కొరటాల శివకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ కూడా నచ్చలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం మణిశర్మ కొడుకు స్వరసాగర్ ఆచార్య రీరికార్డింగ్ కోసం పని చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తలు మెగా అభిమానులను తెగ టెన్షన్ పెడుతున్నాయి. వాస్తవానికి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా సినిమాలకు ప్లస్ అయింది. వైరల్ అవుతున్న వార్తల గురించి ఆచార్య మేకర్స్ స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

కొరటాల శివ తర్వాత సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. తారక్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి మొదలుకానుంది. కొరటాల శివ ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారని సమాచారం.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus