మళ్ళీ అదే తప్పు చేస్తున్న ప్రభాస్ నిర్మాతలు..!

ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఓ డియర్’, ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘గోపీకృష్ణ మూవీస్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి 20 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేశారు. అయితే ఇప్పటికీ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు ? అనే విషయం పై మాత్రం క్లారిటీ రాలేదు.

మొన్నటి వరకూ ‘సైరా నరసింహారెడ్డి’ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది … ‘ప్రభాస్ 20’ కి మ్యూజిక్ డైరెక్టర్ అంటూ ప్రచారం జరిగింది. అయితే నిర్మాతల సైడ్ నుండీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ‘సాహో’ విషయంలో కూడా వారు ఇలాగే చేశారు. దానికి ప్రతిఫలంగా తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అయితే అమిత్ త్రివేదినే సంగీత దర్శకుడు అంతా ఫిక్సయిపోయిన తరుణంలో ఇప్పుడు … ఫ్యాన్స్ కు పెద్ద షాక్ ఇచ్చాడు ఈ సంగీత దర్శకుడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమిత్ త్రివేది..

‘తెలుగులో నేను ఒక్క నాని ‘వి’ మరియు ‘క్వీన్’ రీమేక్ అయిన ‘దటీజ్ మహాలక్ష్మీ’ చిత్రాలకు మాత్రమే సంగీతం అందిస్తున్నాని అని చెప్పాడు. అంటే ప్రభాస్ సినిమాకు నేను మ్యూజిక్ డైరెక్టర్ కాదు అని చెప్పినట్టే..! ఇదిలా ఉంటే రంజాన్ పండుగ సంధర్భంగా ‘ప్రభాస్ 20’ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారు అంటూ టాక్ నడుస్తుంది. మరి అప్పుడైనా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ప్రకటిస్తారేమో చూడాలి..!

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus