‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) సినిమా విషయంలో దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో అతన్ని తప్పించి తమన్ (SS Thaman), సామ్ సి ఎస్ (Sam C. S.) , అజనీష్ లోకనాథ్(B. Ajaneesh Loknath)..లని తీసుకున్నారు అనే ప్రచారం జరిగింది. ఫస్ట్ హాఫ్ అంతా తమన్ బీజీఎం ఇచ్చాడని, సెకండాఫ్ అజనీష్ లోకనాథ్, సామ్ సి ఎస్..లు కంపోజ్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయాలపై దర్శకుడు సుకుమార్ (Sukumar) కానీ, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి కూడా ఎక్కడా ప్రస్తావించింది అంటూ లేదు.
SS Thaman
కానీ తమన్ మాత్రం ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) టీజర్ లాంచ్ వేడుకలో ‘ ‘పుష్ప 2′ సినిమాకి 15 రోజుల పాటు వర్క్ చేశానని, సినిమా బాగా వచ్చిందని, ఇంత పెద్ద సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకి థాంక్స్’ అంటూ చెప్పుకొచ్చాడు. మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్స్ సామ్ సి ఎస్, అజనీష్..లు ఎక్కడా దీని గురించి మాట్లాడింది లేదు.
బహుశా తమన్ (SS Thaman) కామెంట్స్ దేవి శ్రీ ప్రసాద్ కి కోపం తెప్పించాయనుకుంట. చెన్నైలో జరిగిన ‘పుష్ప 2’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో నిర్మాతల పై ఉన్న అసహనాన్ని బయటపెట్టాడు. ఈ విషయం పక్కన పెట్టేస్తే.. తమన్ ‘పుష్ప 2’ కోసం ఇచ్చిన ఔట్పుట్ ని .. పక్కన పెట్టేసిందట టీం. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అయ్యింది.
అలా దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన వెర్షన్ ని తీసుకుంటున్నారా? అంటే దానిపై కూడా క్లారిటీ లేదు. ప్రస్తుతానికి అజనీష్ లోకనాథ్ తో కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయిస్తున్నారట. మరి ‘అతని వెర్షన్ ని ఫైనల్ చేస్తారో లేక అటు తిప్పి ఇటు తిప్పి దేవి శ్రీ వెర్షన్ నే ఫైనల్ చేస్తారో?’ లేదో తెలియాల్సి ఉంది.