టాలీవుడ్ స్టార్ నాని (Nani) వరుస విజయాలతో తన కెరీర్‌లో మరో ఫేజ్‌కు చేరుకున్నాడు. ఇటీవల విడుదలైన “సరిపోదా శనివారం”తో (Saripodhaa Sanivaaram) మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని, ప్రస్తుతం “హిట్ 3” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో “దసరా” (Dasara) దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో (Srikanth Odela) మరో సినిమా కూడా లైన్‌లో ఉంది. ఈ చిత్రానికి పారడైజ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అధికారిక ప్రకటన ఇంకా రాకముందే ఈ పేరు లీక్ కావడంతో సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది.
అయితే ఈ సినిమాలో మరో యువ హీరో కనిపించే అవకాశం ఉన్నట్లు టాక్. “దసరా”లో శ్రీకాంత్ ఓదెల నాని పాత్రకు సమానంగా దీక్షిత్ శెట్టి పాత్రను డిజైన్ చేశాడు. ఫస్ట్ హాఫ్ వరకు దీక్షిత్ పాత్రకు పెద్ద స్కోప్ ఇచ్చి, సెకండ్ హాఫ్ మొత్తం నానిపై ఆధారపడేలా రూపొందించారు. ఇప్పుడు అదే ఫార్ములాను పారడైజ్లోనూ ఫాలో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోనూ నాని సరసన మరో ముఖ్యమైన పాత్ర ఉండనుందని సమాచారం.
అయితే, ఈ పాత్రను ఎవరు పోషించనున్నారు అన్న చర్చ నడుస్తోంది. నాని సినిమాలో కథ ఎప్పుడూ కూడా కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పారడైజ్ కథలో నాని పాత్రతో పాటు మరో పాత్ర కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా ఉండబోతోంది. “దసరా”లో దీక్షిత్, “హాయ్ నాన్నా”లో (Hi Nanna) మృణాల్ వంటి సహా నటుల పాత్రలు సినిమా విజయానికి ప్రధాన కారణంగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు పారడైజ్ లో ఆ ప్రాధాన్యత గల పాత్ర ఎవరు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
యూనిట్ నుండి లీకైన సమాచారం ప్రకారం, నాని పాత్రకు ఈక్వల్‌గా ఉన్న రోల్ కోసం స్టార్ యాక్టర్‌ను ఎంపిక చేయాలని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పాన్ ఇండియా స్థాయిలో సినిమా క్రేజ్‌ను పెంచగలదని యూనిట్ అంచనా వేస్తోంది. కొన్ని కథనాల ప్రకారం, ఆ పాత్ర కోసం ఇతర భాషల నటుడిని సంప్రదించే అవకాశం కూడా ఉంది., పారడైజ్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ రహస్య పాత్రకు ఎవరిని తీసుకుంటారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.