కొరటాల శివ ‘మిర్చి’ చిత్రంతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక రెండో సినిమా ‘శ్రీమంతుడు’ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రంతో ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఇక కొరటాల మూడో చిత్రం ‘జనతా గ్యారేజ్’ ను కూడా ‘మైత్రి’ వారే నిర్మించారు. ఈ హిట్టుతో హ్యాట్రిక్ కంప్లీట్ చేశాడు కొరటాల. అలాగే దర్శకుడు మరో దర్శకుడు చందు మొండేటి మూడో సినిమాని కూడా మైత్రి వారే నిర్మించారు.
అతని మొదటి సినిమా ‘కార్తికేయ’ తో హిట్టు అందుకున్నాడు. తర్వాత రెండో సినిమా ‘ప్రేమమ్’ తో కూడా విజయాన్ని అందుకున్నాడు. మూడో చిత్రాన్ని సక్సెస్ కు కేరాఫ్ అడ్రెస్ అయిన ‘మైత్రి’ వారి నిర్మాణంలో చేశాడు. అదే ‘సవ్యసాచి’. ఈ సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది. దీంతో చందూ మొండేటి హ్యాట్రిక్ మిస్ అయ్యాడు. ఇప్పుడు మరో దర్శకుడు కూడా ‘మైత్రి’లో మూడో సినిమా చేశాడు. అతనే వివేక్ ఆత్రేయ.
‘మెంటల్ మదిలో’ ‘బ్రోచేవారెవరురా’ వంటి చిత్రాలతో హిట్లు అందుకున్నాడు ఈ దర్శకుడు. ‘మైత్రి’ వారి నిర్మాణంలో మూడో సినిమా చేశాడు. అదే ‘అంటే సుందరానికీ’. జూన్ 10 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. మరి ఈ చిత్రంతో హిట్టు కొట్టి కొరటాల సరసన చేరుతాడా? లేక ప్లాప్ అందుకుని చందూ మొండేటిలా మిగిలిపోతాడా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ‘అంటే సుందరానికీ!’ చిత్రంలో హీరోగా నాని నటించగా… నజ్రియా హీరోయిన్ గా నటించింది.
బుకింగ్స్ అయితే చాలా డల్ గా ఉన్నాయి. అందుకోసమే పవన్ కళ్యాణ్ ను ప్రీ రిలీజ్ వేడుకకి తీసుకొచ్చి ప్రమోట్ చేస్తున్నారు. నిజానికి సినిమా రిలీజ్ కు రెండు రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ కు జూన్ 9న ఖాళీ ఉండడంతో ఆయనకి అనుకూలంగా ఈరోజు ప్రీ రిలీజ్ వేడుకని పెట్టారు నిర్మాతలు.