స్టార్ హీరోల సినిమాలకు హిట్ టాక్ వస్తే భారీ స్థాయిలో కలెక్షన్లు రావడం గ్యారంటీ అనే సంగతి తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. మల్టీప్లెక్స్ ల హవాతో సింగిల్ స్క్రీన్స్ జోరు తగ్గుతోంది. అయితే సంక్రాంతికి రెండు సినిమాలను రిలీజ్ చేసి రెండు సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న మైత్రీ నిర్మాతలు ప్రస్తుతం థియేటర్ల కొనుగోలుపై దృష్టి పెట్టారని బోగట్టా. గుంటూరులో ఐదు స్క్రీన్లతో ఉన్న అద్భుతమైన మల్టీప్లెక్స్ ను కొనుగోలు చేయడానికి మైత్రీ నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ మల్టీప్లెక్స్ అమ్మకానికి రావడంతో మైత్రీ నిర్మాతలు దాదాపుగా 35 కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. థియేటర్ల విషయంలో కూడా దిల్ రాజుకు మైత్రీ నిర్మాతల నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటం గమనార్హం. ప్రస్తుతం మైత్రీ నిర్మాతల చేతిలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఎగ్జిబిషన్ రంగంపై పట్టు సాధించే దిశగా మైత్రీ నిర్మాతల అడుగులు పడుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో మైత్రీ సంస్థకు క్రేజ్ పెరుగుతోంది.
దాదాపుగా అందరు స్టార్ హీరోలతో ఈ సంస్థ సినిమాలను నిర్మిస్తోంది. బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా మైత్రీ నిర్మాతలు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. హీరోలకు ఈ సంస్థ భారీ రెమ్యునరేషన్లను ఆఫర్ చేస్తుండటం గమనార్హం. రాబోయే రోజుల్లో మైత్రీ సంస్థ దూకుడు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మైత్రీ బ్యానర్ లో ఈ ఏడాది ఖుషి, పుష్ప2 సినిమాలు తెరకెక్కి రిలీజ్ కానుండగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాను మైత్రీ నిర్మాతలే నిర్మించనున్నారని సమాచారం అందుతోంది. మైత్రీ సంస్థ దూకుడుకు ఇప్పట్లో బ్రేకులు వేయడం కష్టమని కామెంట్లు వినిపిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?