ఆ హీరోయిన్ ని దూరం పెట్టిన మైత్రీమూవీస్..?

రెండేళ్ల క్రితం ‘రంగస్థలం’ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ని తీసుకోవాలని అనుకున్నారు. చరణ్ పక్కన ఆమెని పెట్టి లుక్ టెస్ట్ కూడా చేశారు. అంతా ఓకే అనుకొని సెట్స్ పైకి వెళ్లాలనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఆమెని తప్పించి.. సమంతని తీసుకున్నారు. దీంతో హర్ట్ అయిన అనుపమ.. అప్పట్లో సోషల్ మీడియాలో మైత్రీమూవీస్ కి చురకలంటిస్తూ ఓ పెద్ద ట్వీట్ పెట్టింది. ఆ వెంటనే స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తమ రాబోయే చిత్రాల్లో అనుపమకు ఖచ్చితంగా ఓ సినిమా ఛాన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇది జరిగి రెండేళ్లు పైగానే అయింది. ఈ రెండేళ్లలో మైత్రీ సంస్థ నుండి చాలా సినిమాలే వచ్చాయి. కానీ ఏ ఒక్క సినిమాలో కూడా అనుపమ కనిపించలేదు. సాయి తేజ్ నటించిన ‘చిత్రలహరి’ సినిమా కోసం అనుపమ పేరు వినిపించింది. కానీ అందులో కూడా అనుపమ లేదు. ఇప్పుడు తాజాగా ఈ బ్యానర్ పై మరో సినిమాని ప్రకటించడానికి రెడీ అవుతున్నారు. నాని హీరోగా కొత్త సినిమాని అనౌన్స్ చేయనున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పని చేయనున్నారు. ఈ సినిమా కోసమైనా అనుపమని తీసుకుంటారేమో అనుకుంటే.. ఇప్పుడు రష్మికకి ఆ ఛాన్స్ దక్కిందని ప్రచారం జరుగుతోంది.

ఇవన్నీ చూస్తుంటే మైత్రీ మూవీస్ నిర్మాతలు అనుపమకి ఛాన్స్ ఇస్తామని మాటవరసకు చెప్పినప్పటికీ వాళ్లకు ఆ ఉద్దేశం లేదని తెలుస్తోంది. తమ బ్యానర్ పై నెగెటివ్ మార్క్ పడకూడదని అప్పట్లో అనుపమకి ఛాన్స్ ఇస్తామని చెప్పారు కానీ అవన్నీ ఉట్టి మాటలే అని అర్ధమవుతోంది. ప్రస్తుతం అనుపమ చేతిలో తెలుగు సినిమాలేవీ లేవు.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus