2023 సంక్రాంతికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విజయ్ ‘వరిసు’ సినిమాను ‘వారసుడు’ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. అలానే అజిత్ ‘తునివు’ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా దిల్ రాజే తీసుకున్నారు. సంక్రాంతికి డబ్బింగ్ సినిమాల రిలీజ్ విషయంలో వ్యతిరేకంగా మాట్లాడే దిల్ రాజు ఇప్పుడు రెండు డబ్బింగ్ సినిమాలు ఎందుకు రిలీజ్ చేయాలనుకుంటున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. దానికొక కారణం ఉందని అంటున్నారు.
సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలను నిర్మించింది ఒకటే ప్రొడక్షన్ హౌస్. అదే మైత్రి మూవీ మేకర్స్. ఇప్పుడు ఈ రెండు సినిమాలను నైజాం ఏరియాలో సొంతంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు మైత్రి మూవీ మేకర్స్. దీనికి తగ్గట్లే నైజాం ఏరియాలో ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ను ఓపెన్ చేసి.. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తో మంతనాలు సాగిస్తున్నారు మైత్రి నిర్మాతలు.
ఈ విషయంలో దిల్ రాజు హర్ట్ అయినట్లు సమాచారం. నైజాం ఏరియాలో ఎక్కువ థియేటర్లు కలిగి ఉన్న దిల్ రాజుని సంప్రదించకుండా.. సొంతంగా రిలీజ్ చేసుకోవాలనుకోవడం, వేరే డిస్ట్రిబ్యూటర్స్ తో సంప్రదింపులు జరపడం దిల్ రాజుకి నచ్చలేదట. దీంతో మైత్రి సంస్థ నుంచి వస్తోన్న సినిమాలకు ఎక్కువ థియేటర్లు దొరక్కుండా తన బ్యానర్ నుంచి వస్తోన్న ‘వారసుడు’..
అలానే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్న ‘తునివు’ సినిమాలకు ఎక్కువ థియేటర్లు కేటాయించాలని చూస్తున్నారు. దిల్ రాజు తరువాత ఏషియన్ సినిమాస్ కి నైజాంలో మంచి గ్రిప్ ఉంది. దీంతో ఇప్పుడు ఆ సంస్థను సంప్రదించాలని చూస్తున్నారు మైత్రి నిర్మాతలు. మరేం జరుగుతుందో చూడాలి!
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!