Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ గురించి ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ప్రేమ్ రక్షిత్ ఒకరు. నాటు నాటు సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించడం ద్వారా ప్రేమ్ రక్షిత్ పేరు మారుమ్రోగుతోంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రేమ్ రక్షిత్ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. డబ్బుల కోసం జక్కన్న దగ్గర నిజం దాచానంటూ ప్రేమ్ రక్షిత్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. కెరీర్ తొలినాళ్లలో మూడు రోజులకు ఒకసారి భోజనం చేసేవాడినని డబ్బుల కోసం డాన్స్ ట్రైనర్ గా పని చేశానని ఆయన అన్నారు.

సింహా, కాలభైరవ, కార్తికేయలకు తాను డాన్స్ నేర్పించేవాడినని ప్రేమ్ రక్షిత్ చెప్పుకొచ్చారు. రమా రాజమౌళి అడిగి మరీ భోజనం పెట్టేవారని రెండు మూడు రోజుల భోజనం ఒకేసారి అక్కడ చేసేవాడినని ప్రేమ్ రక్షిత్ పేర్కొన్నారు. ఆ సమయానికి నేను డ్యాన్స్ ట్రైనర్ ను మాత్రమే అని జక్కన్నకు చెప్పానని కొరియోగ్రాఫర్ అని తెలియదని ప్రేమ్ రక్షిత్ పేర్కొన్నారు. పేరెంట్స్ కు డబ్బు పంపాల్సి ఉండటంతో పాటు రెంట్, పెట్రోల్ ఖర్చుల కోసం సంపాదించిన డబ్బును వాడానని ప్రేమ్ రక్షిత్ అన్నారు.

తాను అప్పటికే విద్యార్థి, నందిని సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేశానని ఆయన కామెంట్లు చేశారు. రాజమౌళి గారి ఇంట్లో ఉన్న సమయంలో విద్యార్థి సాంగ్ వినిపించడంతో ఆ సాంగ్ కు నేను కొరియోగ్రాఫర్ గా పని చేశానని రాజమౌళికి చెప్పానని ప్రేమ్ రక్షిత్ వెల్లడించారు. రాజమౌళి మొదట నమ్మలేదని ఆ తర్వాత నా పరిస్థితి ఆయనకు అర్థమైందని ప్రేమ్ రక్షిత్ పేర్కొన్నారు.

సై సినిమా నుంచి రాజమౌళి గారితో ప్రయాణం కొనసాగిందని ఆయన చెప్పుకొచ్చారు. నాటు నాటు సాంగ్ కు అవార్డ్ రావడం సంతోషాన్ని కలిగించిందని ప్రేమ్ రక్షిత్ అన్నారు. 150 మంది డ్యాన్సర్లతో నాటు నాటు సాంగ్ షూట్ జరిగిందని ఆయన తెలిపారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus