Naatu Naatu: రెహమాన్‌ తర్వాత మళ్లీ కీరవాణికే ఆ ఛాన్స్‌.. ఎక్కడంటే?

ప్రతిష్టాత్మక ఆస్కార్‌ పురస్కారం బరిలో మన ‘నాటు నాటు…’ పాట ఉన్న విషయం తెలిసిందే. ఈ మధ్య వరకు విదేశీ వేదికల మీద తెగ వినిపించిన ఈ పేరు, హోరుకు కాస్త రెస్ట్‌ ఇచ్చారు. త్వరలో మళ్లీ ‘నాటు నాటు..’ ఫుల్‌ జోష్‌లో మోగబోతోంది. వచ్చే నెలలో ఆస్కార్‌ పురస్కార ప్రదానోత్సవం ఉండటంతో.. పాటను మరింతగా ప్రమోట్‌ చేసే పనిలో ఉన్నారు రాజమౌళి అండ్‌ కో. అయితే ఈ సమయంలో మరో ఆసక్తికర విషయం తెలిసింది.

అదే ‘ఆస్కార్‌’ వేదికపై ‘నాటు నాటు’ మోగబోతోందట. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ గతేడాది మార్చిలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం అందుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా స్ట్రీమింగ్‌ స్టార్ట్‌ అయ్యాక.. ఆ హిట్‌ జోరు ఇంకా పెరిగింది. ఇంటర్నేషన్‌ సెలబ్రిటీలు చాలామంది సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్లు చేశారు. ఇక అంతర్జాతీయ పురస్కరాల హడావుడి మొదలయ్యాక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ క్రమంలో బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ‘నాటు నాటు’ ఆస్కార్‌ బరిలో నిలిచింది.

అంత పేరు తెచ్చుకున్న ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరిచారు. చంద్రబోస్ లిరిక్స్ అందించగా, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఇప్పుడు ఈ పాటను ఆస్కార్ వేదికపై ప్రదర్శించడానికి కీరవాణితో పాటు రచయిత చంద్రబోస్‌ సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ మేరకు వీరికి ఆస్కార్‌ నుండి ఆహ్వానం అందింది అంటున్నారు. కీరవాణి ఆస్కార్ వేదికపై లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.

ఆస్కార్ వేదికలపై మన భారతీయులు లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో ‘జై హో’ పాటను ఏ ఆర్ రెహమాన్ లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వచ్చినప్పుడే రాజమౌళి, రామ్‌చరణ్‌, తారక్‌ స్టేజీ దిగువ సందడి చేశారు. ఇప్పుడు ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ వేదిక మీద ఆలపిస్తే.. ఇంకెంత సందడి చేస్తారో చూడాలి. ఏకంగా డ్యాన్స్‌లు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ పాట ‘జైహో’లాంటిది కాదు. డ్యాన్స్‌ ఉంటేనే ఈ పాటకు అందం అనే విషయం గుర్తుంచుకోవాలి.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus