Nag Ashwin, Kalki: కల్కి సీక్రెట్స్ రివీల్ చేసిన నాగ్ అశ్విన్.. 6000 సంవత్సరాల కథ అంటూ?

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ కు మరో రెండున్నర నెలల సమయం మాత్రమే ఉంది. 22 భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుండగా ప్రమోషన్స్ ను సైతం భారీ స్థాయిలో ప్లాన్ చేశారని భోగట్టా. నాగ్ అశ్విన్ తాజాగా ఒక సందర్భంలో కల్కి టైటిల్ సీక్రెట్స్ రివీల్ చేయడంతో ఈ సినిమా కథకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కల్కి 2898 ఏడీ కథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుందని ఆయన అన్నారు. గతంతో ప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ఈ సినిమా కథకు అనుగుణంగా కల్కి 2889 ఏడీ అనే టైటిల్ ను ఫిక్స్ చేయడం జరిగిందని టైటిల్ గురించి నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమాలో 6,000 సంవత్సరాల మధ్య జరిగే కథను చూపించనున్నామని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు.

నాటి రోజులకు అనుగుణంగా ప్రపంచాన్ని సృష్టించామని ఆయన కామెంట్లు చేశారు. బ్లేడ్ రన్నర్ పోలికలు ఈ సినిమాలో కనిపించవని సినిమాకు సంబంధించి అన్నిట్లో భారతీయ కనిపించేలా తగిన జాగ్రత్తలను తీసుకున్నామని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ సినిమాపై తన కామెంట్స్ తో (Nag Ashwin) నాగ్ అశ్విన్ అంచనాలను పెంచేశారు.

కల్కి 2898 ఏడీ టీజర్ రిలీజ్ తో ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో సైతం ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు ఫీలవ్గుతున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ కు సెంటిమెంట్ డేట్ అయిన మే నెల 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ కానున్న కల్కి టాలీవుడ్ సినిమా స్థాయిని మరింత పెంచుతుందని సినీ అభిమానులు భావిస్తున్నారు.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus