Nag Ashwin: ‘జాతి రత్నాలు 2’ నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చేశాడు.. కానీ..!
- March 19, 2025 / 09:26 AM ISTByPhani Kumar
కోవిడ్ తర్వాత సైలెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu). పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు అందుకుంది. నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) ఈ సినిమాతో తన మార్కెట్ ను స్ట్రాంగ్ చేసుకున్నాడు. కె.వి.అనుదీప్ (Anudeep Kv).. ఈ ఒక్క సినిమాతో టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు. ప్రియదర్శి (Priyadarshi Pulikonda), రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna)..ల కామెడీ కూడా బాగా పండింది.
Nag Ashwin

ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని మొన్నామధ్య ప్రచారం జరిగింది. అది నిజమే అన్నట్టు.. దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) కన్ఫర్మ్ చేశాడు. ఈరోజు జరిగిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ (Yevade Subramanyam) రీ- రిలీజ్ ప్రెస్ మీట్లో నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ‘జాతి రత్నాలు 2’ కూడా చేసే ఉద్దేశం తనకు ఉందని తెలిపాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వెంటనే చేయడానికి తాను సిద్ధం అన్నట్టు కూడా హింట్ ఇచ్చాడు ఈ స్టార్ డైరెక్టర్.

‘అమెరికా నేపథ్యంలో కథ, కథనాలు ఉంటాయని, ముగ్గురు కుర్రాళ్ళు వీసా లేకుండా అమెరికా వెళ్లి, ఓ క్రైమ్లో ఇరుక్కుంటే.. తర్వాత వాళ్లకి ఎలాంటి ఇబ్బందులు వచ్చి పడ్డాయి, వాళ్ళు ఎలా బయటపడ్డారు?’ అనే లైన్ తో కథ, కథనాలు ఉంటాయని టాక్. అయితే ప్రస్తుతం అనుదీప్ ఫామ్లో లేడు. ‘ఫంకీ’ హిట్ అయితే అతను ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడే హీరో నవీన్ పోలిశెట్టి కూడా ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవచ్చు.
కల్కి2 కంటే ముందు కుదిరితే జాతిరత్నాలు 2 ప్రొడ్యూస్ చేస్తాను – నాగ్ అశ్విన్#NagAshwin #JathiRatnalu #Prabhas #Kalki2898AD #Kalki2 #YevadeSubramanyam pic.twitter.com/J8SxESYb5a
— Filmy Focus (@FilmyFocus) March 18, 2025















