టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న చిత్రాల్లో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘మహానటి’ లాంటి సినిమా తరువాత దర్శకుడు నాగ్ అశ్విన్ తీస్తోన్న సినిమా కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. పైగా సైంటిఫిక్ థ్రిల్లర్ సబ్జెక్ట్ కావడం.. దానికోసం రూ.400 కోట్ల బడ్జెట్ ని కేటాయించడంతో.. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని ఆశిస్తున్నారు. ఈ సినిమా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఉన్నప్పటికీ.. ఎప్పటికప్పుడు సినిమాకి సంబంధించి కొత్త కబుర్లు చెబుతూనే ఉన్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
తాజాగా తన నిర్మాణంలో తెరకెక్కిన ‘జాతిరత్నాలు’ సినిమా ప్రమోషన్స్ కోసం మీడియాతో ముచ్చటించారు నాగ్ అశ్విన్. ఈ క్రమంలో ప్రభాస్ తో చేయబోయే సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. నిజానికి ప్రభాస్ సినిమాను గతేడాది జూన్ లోనే మొదలుపెట్టాలని అనుకున్నామని.. కానీ కరోనా వలన ఆలస్యమైందని చెప్పారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి చాలా సమయం పట్టేలా ఉండడంతో ఇంకా ఆలస్యంగా సినిమాను మొదలుపెడుతున్నామని చెప్పారు. ఏడాదికి పైగా సమయం ప్రీప్రొడక్షన్ పనుల కోసం కేటాయిస్తున్నామని.. ఈ సినిమా కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించాల్సి ఉందని నాగ్ అశ్విన్ తెలిపారు.
‘మహానటి’ సినిమాలో వాడిన పాత కార్లు లాంటివి తెప్పించడం పెద్ద కష్టం కాదని.. కానీ ప్రభాస్ తో తాను చేయబోయే సినిమాలో వాడే వాహనాలు ఎక్కడా దొరకవని.. వాటిని ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నామని చెప్పారు. ఒక్క వాహనాలు మాత్రమే కాదని.. ఈ సినిమాకి సంబంధించిన ప్రతీదీ ఆర్ట్ డిపార్ట్మెంట్ తో తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. స్క్రిప్ట్ తో సహా సినిమాలో ప్రతీదీ కొత్తగానే ఉంటుందని.. ఈ సినిమాతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తామని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది జూన్-జూలై నెలలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని మొదలుపెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు.
Most Recommended Video
ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!