Naga Babu, Vaishnav Tej: వైష్ణవ్ తో కలిసి నాగబాబు వర్కౌట్లు.. వీడియో వైరల్..!

మెగా బ్రదర్ నాగబాబు ఎప్పుడూ తన సోషల్ మీడియా ఫాలోవర్లతో టచ్ లోనే ఉంటుంటారు. యూట్యూబ్లో అయితే ఏదో ఒక విషయం పై తాను చేసిన పరిశోధన గురించి ముచ్చటిస్తూ ఉంటారు. ఇక కూతురు పెళ్ళైన తర్వాత నాగబాబు మరింత ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా పిట్ నెస్ ఆయన ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు స్పష్టమవుతుంది.గతంలో హీవీ వెయిట్ తో కనిపించిన నాగబాబు ఈ మధ్యన కాస్త చిక్కారు.

Click Here To Watch

దానికి కారణం ఏంటనేది కూడా ఆయన పరోక్షంగా వెల్లడించారు.కొద్దిరోజుల క్రితం ‘సరైన డైట్‌ను పాటించడం వల్లే బరువు తగ్గానని’ తెలిపిన నాగబాబు జిమ్ లో వర్కౌట్లు చేసిన విషయాన్ని సీక్రెట్ గా ఉంచి తాజాగా ఆ వీడియోలను కూడా బయటపెట్టారు. తన మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌తో కలిసి నాగబాబు చేసిన వర్కవుట్లు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ‘నా మేనల్లుడిలో నాకు జిమ్ మేట్ కనిపించాడు.. నా శరీరాకృతిని మార్చుకునేందుకు నాకు సరైన పార్ట్నర్ దొరికాడు’ అంటూ నాగబాబు…

వైష్ణవ్ తో చేసిన జిమ్ వర్కౌట్ల వీడియోలను బయటపెట్టారు. ఇక 2020 లో ‘జబర్దస్త్’ కు గుడ్ బై చెప్పిన నాగబాబు తర్వాత జీ తెలుగులో ప్రసారమయ్యే ‘అదిరింది’ షోకి జడ్జిగా వ్యవహరించారు. తర్వాత కొన్నాళ్ళు బుల్లితెరకి దూరమయ్యారు. మళ్ళీ ఇప్పుడు ‘స్టార్ మా’లో టెలికాస్ట్ అయ్యే ‘కామెడీ స్టార్స్ ధమాకా’ షోలో నాగబాబు పాల్గొంటున్నారు.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video


బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus