Naga Chaitanya, Sobhita: కాబోయే భార్యతో నాగ చైతన్య.. షాకిస్తున్న ఫోటో.!

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)  – శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala).. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 8న వీరి ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య తండ్రి ‘కింగ్’ అక్కినేని నాగార్జున (Nagarjuna) ఇంట్లో వీరి ఎంగేజ్మెంట్ వేడుకని నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఆ వేడుకకు ముందు.. అంటే దాదాపు 3 ఏళ్ళ నుండి నాగ చైతన్య- శోభిత.. డేటింగ్లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

Naga Chaitanya, Sobhita:

చైతన్య (Naga Chaitanya) విదేశాలకు వెళ్లిన ప్రతిసారి.. అతను ఎక్కడి నుండైతే ఫోటోలు షేర్ చేసేవాడో.. అక్కడి నుండే శోభిత కూడా ఫోటోలు షేర్ చేస్తూ వచ్చేది. అయితే వాటి గురించి నాగ చైతన్య కానీ శోభిత కానీ వెంటనే బయటపడలేదు. ఫైనల్ గా ఆ గాసిప్స్ నిజమయ్యాయి అని చెప్పాలి. ఇక ఎంగేజ్మెంట్ వేడుక తర్వాత వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు వంటివి బయటకు రాలేదు. అయితే ఎంగేజ్మెంట్ జరిగిన చాలా రోజుల తర్వాత..

వీరిద్దరూ కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు. అక్కినేని నాగచైతన్య ఈ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఇందులో కాబోయే భార్య శోభితతో కలిసి ఉన్నాడు నాగ చైతన్య. ఇద్దరూ బ్లాక్ ఔట్-ఫిట్స్ లో చాలా స్టైలిష్ గా ఉన్నారు. ‘ప్రతీచోటా మొత్తం ఒకేసారి’ అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చాడు చైతన్య. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.

సాయిపల్లవితో ఫస్ట్‌ మీటింగ్‌ ముచ్చట్లు షేర్‌ చేసిన స్టార్‌ హీరో.. ఏం చెప్పారంటే?

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus