స్టార్ హీరో నాగార్జున కొన్ని రోజుల క్రితం ఏపీ టికెట్ రేట్ల గురించి స్పందిస్తూ ఏపీలో అమలవుతున్న తక్కువ టికెట్ రేట్ల వల్ల తమకు ఇబ్బంది లేదని అన్నారు. అయితే నాగార్జున ఈ విధంగా కామెంట్లు చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. కొంతమంది హీరోల అభిమానులు నాగార్జునను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. అయితే తాజాగా నాగచైతన్య సైతం టికెట్ రేట్లు తక్కువున్నా సమస్య లేదని చెప్పుకొచ్చారు. ఈ విధంగా టికెట్ రేట్ల గురించి స్పందించడానికి గల కారణాన్ని సైతం నాగచైతన్య వెల్లడించారు.
ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు అమలులోకి వచ్చిన తర్వాత బంగార్రాజు సినిమా షూటింగ్ మొదలైందని సినిమా టికెట్ రేట్లకు అనుగుణంగానే బడ్జెట్ ను ప్లాన్ చేశామని తెలిపారు. తక్కువ బడ్జెట్ తోనే బంగార్రాజు సినిమా తెరకెక్కిందని నాగచైతన్య చెప్పకనే చెప్పేశారు. బంగార్రాజు సినిమా రిలీజ్ సమయానికి టికెట్ ధరల పెంపు అమలైతే దానిని బోనస్ గా భావించాలని అనుకున్నామని చైతన్య అన్నారు. చైతన్య టికెట్ రేట్ల గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్య నటిస్తున్న ఇతర సినిమాలలో థాంక్యూ సినిమా చాలా నెలల క్రితమే మొదలైంది. ఈ సినిమా గురించి మీడియా అడగగా ఆ సినిమాకు నటుడిగా తన వంతు చేశానని మిగిలిన విషయాలను నిర్మాత దిల్ రాజు చూసుకుంటారని చెప్పుకొచ్చారు. టికెట్ రేట్లతో తనకు సమస్య లేదని చైతన్య చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు వరుసగా సినిమాలలో నటిస్తూ చైతన్య కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.
థాంక్యూ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా చైతన్య విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో ఒక హారర్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. పరశురామ్ నాగచైతన్య కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. సర్కారు వారి పాట సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.