Naga Chaitanya: ఇంటర్వ్యూ : ‘కస్టడీ’ గురించి నాగ చైతన్య చెప్పిన ఆసక్తికర విషయాలు..!.

నాగ చైతన్య నటించిన ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ మే 12 న విడుదల కాబోతోంది. తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా ఈ మూవీ ఏకకాలంలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్నాడు. తాజాగా ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీ కోసం :

ప్ర) మీరు చాలా కూల్ పర్సన్? ‘కస్టడీ’ అనేది సీరియస్‌ సబ్జెక్ట్… మీ ఇమేజ్ కు ఇది ఎంత వరకు మ్యాచ్ అవుద్ది అని భావించి ఎంపిక చేసుకున్నారు?

నాగ చైతన్య : ప్రతి సినిమాకు 2 నెలల పాటు వర్క్‌ షాప్‌ చేస్తాను. క్యారక్టర్‌ ఎలా ఉంటుంది? నేను ఎలా నటించాలి? కుదిరితే 5డి కెమెరాతో షూట్‌ చేయించుకుని చెక్ చేసుకుని.. అప్పుడు షూటింగ్లో జాయిన్ అవుతాను. ‘కస్టడీ’ కథ పరంగా కొంతమంది పోలీసు కానిస్టేబుళ్లను నేను కలవడం జరిగింది. వెంకట్‌ ప్రభు కూడా అందుకు సహకరించారు. కానిస్టేబుల్స్ కష్టం విన్నాక నాకే ఇన్స్పైరింగ్ గా అనిపించింది. అలా ‘కస్టడీ’ కి రెడీ అయ్యాను.

ప్ర)మీకు నచ్చిన ‘కాప్'(పోలీస్ కథలు) సినిమాలు ఏంటి?

నాగ చైతన్య : ‘ఘర్షణ’ నాకు ఆల్‌ టైం ఫేవరెట్ . అలాగే ‘జేమ్స్‌ బాండ్‌ 007’ సినిమాలు కూడా ఇష్టం.

ప్ర)’మానాడు’ సినిమా తర్వాత వెంకట్ ప్రభు గారితో సినిమా చేయాలి అనుకున్నారా?

నాగ చైతన్య : నిజానికి ‘మానాడు’ కంటే ముందే నేను వెంకట్‌ ప్రభుగారిని కలిసి ‘కస్టడీ’ కథ విన్నాను. నాకు నచ్చేసి ఓకే చెప్పేశాను.

ప్ర)’కస్టడీ’ తర్వాత మీ ఇమేజ్ ఎలా మారుతుంది అని భావిస్తున్నారు?

నాగ చైతన్య : నేను (Naga Chaitanya) సినిమా చూశా. చాలా నమ్మకంతో ఉన్నాను. ఆడియన్స్‌ ఎలా స్వీకరిస్తారో నాకు తెలీదు. కానీ వాళ్ళ రిజల్ట్ పైనే అంతా ఆధారపడి ఉంటుంది. నేను చేసే ప్రతి సినిమా డిఫరెంట్‌ గా ఉండాలి అని కోరుకుంటాను. అది రిజల్ట్ తో సంబంధం లేకుండా..!

ప్ర) యాక్షన్‌ సీన్స్ కోసం ఫైట్ మాస్టర్స్ తో ఎక్కువ డిస్కషన్స్ ఏమైనా చేశారా?

నాగ చైతన్య : యెస్.. చేశాను..! అందుకే యాక్షన్‌ సీన్స్‌ చాలా నాచురల్‌ గా వచ్చాయి. పైకి ఎగిరే సన్నివేశాలు, అండర్‌ వాటర్‌ వంటి సీన్స్‌ వారితో చర్చించాక చేసినవే. కస్టడీ ట్రైలర్‌, టీజర్‌ లో అది మీకు కనిపిస్తుంది.

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

నాగ చైతన్య : నేను కానిస్టేబుల్‌ పాత్రలో కనిపిస్తా.! నా పాత్ర పరంగా వెంకట్‌ ప్రభుగారు చెప్పింది చెప్పినట్లు తీశారు. చాలా ఎంజాయ్‌ చేస్తూ చేసిన పాత్ర ఇది.

ప్ర) ఇప్పటి వరకు తెలుగు దర్శకులతో చేశారు.? ఇప్పుడు తమిళ దర్శకుడితో చేశారు? తెలుగు డైరెక్టర్లకు తమిళ డైరెక్టర్లకు మార్పు ఏమైనా కనిపించిందా?

నాగ చైతన్య : భాషతో సంబంధం ఏమీ లేదు. ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. వెంకట్‌ ప్రభుగారి స్క్రీన్‌ప్లే చాలా వెరైటీగా ఉంటుంది. ‘మానాడు’ అనేది చాలా కన్‌ఫ్యూజింగ్ పాయింట్. కానీ అందరికీ అర్ధమయ్యేలా చెప్పారు. ఆయన చాలా మెచ్చూర్డ్‌ డైరెక్టర్‌.

ప్ర) దర్శకుడు వెంకట్ ప్రభు మీకు చెప్పినట్టే సినిమా తీశారా?

నాగ చైతన్య : నాకు ఎలా చెప్పారో.. అలాగే తీశారు. నా కెరీర్లో ఇది మంచి సినిమా అవుతుంది. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది నాకు తెలీదు.

ప్ర)మీరు చేసిన సినిమాలలో తప్పొప్పులు గురించి ఆలోచిస్తారా?

నాగ చైతన్య : నటుడిగా అయితే నేనెప్పుడూ సంతృప్తి చెందను. ఫుల్ మర్క్స్ వేసుకోను. ఇంకా ఇంకా వర్క్ చేసుకుంటే బాగుణ్ణు అనుకుంటాను.

ప్ర) అరవింద్‌ స్వామి గారితో పనిచేయడం ఎలా అనిపించింది?

నాగ చైతన్య : చాలా గొప్ప యాక్టర్ ఆయన. షూటింగ్ కు వచ్చినప్పటి నుండి పేకప్‌ అయ్యాక కూడా ఆ పాత్ర గురించే ఆలోచిస్తారు. నైట్‌ మెసేజ్‌ కూడా ఫలానా సీన్‌ గురించి ఇలా ఉండాల్సింది అంటుంటారు.

ప్ర) కృతి శెట్టి ఈ సినిమాలో ఎలా చేసింది? ఇది రెండో సినిమా కదా మీ కాంబోలో..!

నాగ చైతన్య : ఫ్యామిలీ ఎమోషన్స్‌ బాగా పండించింది. నటిగా తను చాలా మెచ్యూర్ అయ్యింది. తమిళ్ కూడా బాగా నేర్చుకుంది.

ప్ర) తమిళ్ లో కూడా మీరే డబ్బింగ్ చెప్పుకున్నారట.. నిజమేనా?

నాగ చైతన్య : అవును నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను. మొదట్లో చిన్న చిన్న లోపాలున్నా బాగానే చెప్పగలిగాను.

ప్ర) ప్రొడ్యూసర్ … నాగార్జునగారికి శివ ఎలాగో, చైతన్యకు కస్టడీ అలాగ అన్నారు. మీరేమంటారు?

నాగ చైతన్య : ఏ సినిమాకూ కస్టడీని కంపేర్‌ చేయొద్దు. నేను ఈ సినిమాపై అయితే చాలా నమ్మకంతో ఉన్నాను అంతే.!

ప్ర)’యాక్షన్’ సినిమాలు మీకు అంతగా కలిసి రాలేదు? అయినా ఏ ధైర్యంతో చేస్తున్నారు?

నాగ చైతన్య : నిజమే.. నేను చేసిన యాక్షన్ సినిమాలు సక్సెస్ కాలేదు. లవ్ స్టోరీలే హిట్ అయ్యాయి కదా అని అవే చేస్తూ ఉంటే.. జనాలకు నేను బోర్ కొట్టేస్తాను. సక్సెస్ వచ్చినా రాకపోయినా నటుడిగా ఎలాంటి పాత్రనైనా చైతన్య చేయగలడు అని ప్రూవ్ చేసుకోవడానికే నేను ఇష్టపడతాను.

ప్ర)ఇప్పటివరకు ఏ డైరెక్టర్ గురించి మీరు సీరియస్ అయ్యింది లేదు. రీసెంట్ గా పరశురామ్ గారి విషయంలో సీరియస్ అయినట్టు అనిపించింది?

నాగ చైతన్య : అలా నేను అనలేదు. మీరు చూశారు కదా. నేను అలా కనిపించానా.? ఆ టాపిక్ ఇక వదిలేయండి.

ప్ర) ‘కస్టడీ 2’ ఉంటుందా?

నాగ చైతన్య : హిట్ అయితే తప్పకుండా చేస్తాం

ప్ర) మీ తోటి హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ కోసం చూస్తున్నారు?మరి మీరు?

నాగ చైతన్య : ప్రస్తుతం.. తెలుగు, తమిళ ఆడియన్స్‌ మాత్రమే నా టార్గెట్‌.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus