Naga Chaitanya: అక్కినేని ఫ్యామిలీ పై బాలయ్య కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నాగ చైతన్య!

నందమూరి తారక రామారావు గారి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు నందమూరి బాలకృష్ణ. తండ్రిలానే బాలయ్య కూడా అన్ని రకాల పాత్రలు పోషించాడు. అయితే మాస్ లో మాత్రం బాలయ్యకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎన్ని ఫ్లాపులు పడినా ఆ ఇమేజే ఇతని స్టార్ డంను కాపాడుతూ వస్తుంది. 60 దాటినా ఇంకా బాలయ్య స్టార్ గా రాణిస్తున్నాడు అంటే అదే కారణం. ముఖ్యంగా బోయపాటి.. బాలయ్య లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి బాలకృష్ణ ఇమేజ్ పెరిగింది అనేది అభిమానులు కూడా ఒప్పుకునే నిజం.

అంతకు ముందు బాలయ్య సినిమాలు ట్రోలర్స్ కు ఫుల్ ఫీస్ట్ గా ఉండేవి. బాలయ్య మాస్ ఇమేజ్ ను కరెక్ట్ గా ఎలా వాడుకోవచ్చో చెప్పింది బోయపాటినే..! అందుకే వీరిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అయ్యింది. ఆ ఇమేజ్ నే దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా వాడుకున్నాడు. ‘వీరసింహారెడ్డి’ తో హిట్టు కొట్టాడు. ఇక్కడి వరకు అంతా హ్యాపీ. ఆదివారం నాడు ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవం పేరుతో ఓ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇది కూడా సంతోషించదగ్గ విషయమే కానీ..! ఈ వేదిక పై బాలయ్య .. ‘అక్కినేని.. తొక్కినేని’ అంటూ అక్కినేని ఫ్యామిలీ పై నెగిటివ్ కామెంట్లు వదిలారు.

ఇది కాస్తా వివాదాస్పదం అయ్యింది. ఎస్వీ రంగారావు గారి గొప్పతనం గురించి చెబుతూ బాలయ్య ‘అక్కినేని..తొక్కినేని’ అనడం జరిగింది. అయితే బాలయ్య మర్చిపోయిన సంగతి ఏంటంటే.. అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ కంటే ముందే నెంబర్ 1 హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఎన్టీఆర్ పనైపోయింది అనుకున్న టైంలో కూడా హిట్లు కొట్టిన ఘనత ఆయనది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరోల్లో ఈయన కూడా ఒకరు. ఇండస్ట్రీకి రెండు కళ్ళు అంటే ఎన్టీఆర్ తో పాటు నాగేశ్వరరావు పేరు కూడా చెప్తారు.

అలాంటి గొప్ప నటుడు పై బాలయ్య ఇలా కామెంట్లు చేయడం తప్పే..! ఇక బాలయ్య కామెంట్స్ పై నాగ చైతన్య కూడా స్పందించాడు. ‘నందమూరి తారక రామారావు గారు.. అక్కినేని నాగేశ్వర రావు గారు ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరపరచడం మనల్ని మనమే కింద పరుచుకోవటం..’ అంటూ ట్విట్టర్ ద్వారా చైతన్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. చైతన్య ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus