Naga Chaitanya, Akhil: ‘లవ్ స్టోరీ’ కి మిస్ అయ్యింది.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కి ప్లస్ అవుతుందా?

సెప్టెంబర్ నెలాఖరులో విడుదలైన ‘లవ్ స్టోరీ’ చిత్రం మంచి ఫలితాన్నే అందుకుంది కానీ.. వాటి కలెక్షన్లను ‘ఉప్పెన’ తో పోల్చి తక్కువ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు… అలాగే యాంటీ అక్కినేని ఫ్యాన్స్. ‘ఉప్పెన’ చిత్రంలో 100శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అవ్వడం పైగా టికెట్ రేట్లు కూడా రూ.200కి పైగా ఉండడం.. ఆ సినిమా భారీ కలెక్షన్లు సాధించడానికి కారణమయ్యాయి. అయితే ‘లవ్ స్టోరీ’ మూవీ ఆంధ్రప్రదేశ్లో 50 శాతం ఆక్యుపెన్సీతోనే రన్ అయ్యింది.

అయినప్పటికీ ఆ చిత్రం రూ.32 కోట్ల షేర్ ను రాబట్టి హిట్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా టాలీవుడ్లో పెద్ద సినిమాలు కూడా రిలీజ్ చేసుకోవచ్చు అనే భరోసా ఇచ్చింది. అయితే అన్న నాగ చైతన్యకి లేని అదృష్టం తమ్ముడు అఖిల్ కు తక్కుతుండడం మరో విశేషం. మ్యాటర్ ఏంటంటే.. అక్టోబర్ 14 నుండీ ఏపిలో 100శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ చేసుకోవడానికి అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దసరా పండుగకు రిలీజ్ అయ్యే సినిమాలకు ఇది పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పాలి.

మరీ ముఖ్యంగా అక్టోబర్ 15న విడుదల కాబోతున్న అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రానికి ఇది మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, సాంగ్స్ కు మంచి స్పందన లభించింది. దాంతో అఖిల్ కెరీర్లో ఈ చిత్రం హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అలాగే అక్కినేని అభిమానులు అంచనా వేస్తున్నారు. వారి నమ్మకం ఎంత బలమైందో చూడాలి మరి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus