Naga Chaitanya, Samantha: సమంత- చైతన్య..ల రొమాంటిక్ ఫోటోలు… మళ్ళీ ఎలా..!

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)  హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏమాయ చేసావె’ (Ye Maaya Chesave) చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సమంత(Samantha) . నిజంగానే ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ ని ఏదో మాయ చేసింది అని చెప్పాలి. ఆ తర్వాత ఈమె చేసిన సినిమాల్లో చాలా వరకు సూపర్ హిట్లు అయ్యాయి. అందులో ‘దూకుడు’ (Dookudu) ‘అత్తారింటికి దారేది’ (Atharintiki Daaredi) వంటి ఆల్ టైం రికార్డులు సృష్టించిన సినిమాలు ఉన్నాయి. దీంతో ఆమె స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది.

Naga Chaitanya, Samantha

ఆ తర్వాత ఆమె చేసిన ‘మనం’ (Manam) సినిమా టైంలో నాగ చైతన్యతో (Naga Chaitanya) ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట.. పెద్దలను ఒప్పించి 2017 లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 4 ఏళ్లపాటు సంతోషంగా కలిసి జీవించారు. కానీ తర్వాత ఏమైందో ఏమో.. ఇద్దరూ విడాకులు తీసుకుని సెపరేట్ అయిపోయారు. వీటి గురించి ఈ జంట ఇప్పటికీ క్లారిటీ ఇచ్చిందంటూ ఏమీ లేదు. ‘ఇద్దరం సినీ కెరీర్లో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో విడాకులు తీసుకున్నట్లు’ ఓ సందర్భంలో నాగ చైతన్య చెప్పుకొచ్చారు.

ఇక సమంత అయితే ఛాన్స్ దొరికిన ప్రతిసారి చైతన్యకి పరోక్షంగా చురకలు వేస్తూ వచ్చింది. గతంలో తనపై ‘స్పై’ చేశారని, అలాంటివి తనని బాగా వేధించాయని.. చైతన్య పై సెటైర్లు వేస్తూ వచ్చింది. వీటిని నాగ చైతన్య ఎప్పుడూ సీరియస్ గా తీసుకుంది అంటూ ఏమీ లేదు. పైగా ఇటీవల అతను శోభిత ధూళిపాళని  (Sobhita Dhulipala) రెండో వివాహం చేసుకుని మళ్ళీ ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో సమంత సంగతేంటి? అనే డిస్కషన్స్ కూడా జరిగాయి.

కానీ ప్రస్తుతానికి ఆమె ‘సిటాడెల్’ వంటి పెద్ద పెద్ద వెబ్ సిరీస్..లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది అని స్పష్టమవుతుంది. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. నాగ చైతన్య, సమంత..లు విడాకులు ప్రకటించడానికి ముందు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలని డిలీట్ చేశారు. అయితే తాజాగా సమంత ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చైతన్యతో ఉన్న ఫోటోలు దర్శనమిచ్చాయి. ఇవి రీ- స్టోర్ అయ్యాయా.. లేక సమంత డిలీట్ చేయకుండా దాచిపెట్టుకుందా అనేది పెద్ద మిస్టరీగా మారింది

రాంచరణ్ ‘ధృవ’ కి 8 ఏళ్ళు.. మంచి బూస్టప్ ఇచ్చిందిగా..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus