మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan).. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తో రాంచరణ్ స్టార్ ఇమేజ్ దేశాలు దాటింది. త్వరలో ‘గేమ్ ఛేంజర్'(Game Changer) సినిమా రిలీజ్ కాబోతోంది. మరోపక్క బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో తన 16 వ (RC16 Movie) సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు చరణ్. ఇది కోస్టల్ బ్యాక్ డ్రాప్లో సాగే స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. ‘రంగస్థలం’ మాదిరి మంచి కంటెంట్ ఉన్న సినిమా అని.. దీంతో కచ్చితంగా చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుందని టీం చెబుతుంది.
దీని తర్వాత సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో కూడా చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. అది భారీ బడ్జెట్ తో రూపొందే సినిమా. దానిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడంతా బాగానే ఉంది. కానీ ఒకప్పుడు చరణ్ పరిస్థితి ఇలా ఉండేది కాదు. ‘చిరుత’ (Chirutha) తో పాస్ మార్కులు వేయించుకున్న చరణ్.. ఆ తర్వాత ‘మగధీర’ (Maghadeera) తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. కానీ వాటి క్రెడిట్ రాంచరణ్ కి దక్కలేదు. తర్వాత ‘రచ్చ’ (Racha) ‘నాయక్’ (Naayak) ‘ఎవడు’ (Yevadu) వంటి రొటీన్ సినిమాలు చేసి కమర్షియల్ సక్సెస్..లు అందుకున్నాడు.
కానీ నటుడిగా మాత్రం ఇంప్రూవ్ కాలేదు. ఓ దశలో కృష్ణవంశీ (Krishna Vamsi) వంటి కంటెంట్ ఉన్న దర్శకుడితో ‘గోవిందుడు అందరివాడేలే’ (Govindudu Andarivadele) అనే సినిమా చేశాడు. ఆ సినిమాలో రాంచరణ్ నటనపై మరింతగా విమర్శలు కురిశాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో చరణ్ నటుడిగా ప్రూవ్ చేసుకోలేకపోయాడు అంటే ఇక అతని కెరీర్ కష్టమే అని అంతా అనుకున్నారు. దానికి తోడు ఆ తర్వాత వచ్చిన ‘బ్రూస్ లీ’ (Bruce Lee) కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది.ఆ సినిమాలో కూడా చరణ్ నటనకు ఎటువంటి ప్రశంసలు దక్కకపోగా.. అతను ట్రోల్ మెటీరియల్ అని అంతా నెగిటివ్ కామెంట్స్ చేశారు.
సరిగ్గా ఇలాంటి టైంలో కోలీవుడ్లో హిట్ అయిన ‘తనీ ఒరువన్’ చిత్రాన్ని చరణ్ తో రీమేక్ చేస్తున్నారు అంటే ఆ నెగిటివ్ కామెంట్స్ ఇంకా ఎక్కువయ్యాయి. సురేందర్ రెడ్డి (Surender Reddy) డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని (Dhruva) ‘గీతా ఆర్ట్స్’ సంస్థ నిర్మించింది. 2015 డిసెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు సురేందర్ రెడ్డి తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి తగ్గట్టు.. ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించాడు. విలన్ అరవింద్ స్వామి (Arvind Swamy) నటన బాగా వచ్చింది.
అయితే అలాంటి సీనియర్ హీరోతో పోటీపడి మరీ రాంచరణ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ‘ఏంటి.. ఇది చరణేనా?’ అని ఆశ్చర్యపోయేలా చేశాడు. ఈ సినిమా చరణ్ పై అప్పటివరకు జరుగుతున్న ట్రోలింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టింది అని చెప్పాలి.ఆ తర్వాత వచ్చిన ‘రంగస్థలం’ (Rangasthalam) కి బాగా హెల్ప్ అయినట్టు అయ్యింది. అయితే నోట్ల రద్దు టైంలో రిలీజ్ అవ్వడం వల్ల బాక్సాఫీస్ వద్ద అబౌవ్ యావరేజ్ ఫలితంతోనే సరిపెట్టుకుంది.