టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య (Naga Chaitanya) తన సినిమా ఎంపికలో వైవిధ్యాన్ని చూపించడానికి ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన హారర్ కామెడీ నేపథ్యంలో ఓ కొత్త ప్రాజెక్ట్ కు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ హైప్‌కు కారణం ప్రఖ్యాత ఆర్కా మీడియా వర్క్స్ నిర్మాణంలో రూపొందుతున్న సినిమా కావడం. ఈ సంస్థ ‘బాహుబలి’ (Baahubali ) వంటి ఐకానిక్ చిత్రాలను నిర్మించి భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త సినిమా కోసం ఆర్కా మీడియా పూర్తిగా డిఫరెంట్ జోనర్ ఎంచుకుని, హారర్ కామెడీ కథతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలని భావిస్తోంది.
Naga Chaitanya
ఓ డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరక్కినట్టు తెలుస్తోంది. శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda) నిర్మాణ బాధ్యతలను తీసుకుంటుండగా, స్క్రిప్ట్‌కి సంబంధించిన అన్ని విషయాలు పూర్తయ్యాయని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఇప్పటికే నాగచైతన్య (Naga Chaitanya) తన కెరీర్‌లో పలు విభిన్న చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో రూపొందుతోన్న ‘తండేల్’ (Thandel) అనే సర్వైవల్ యాక్షన్ డ్రామాలో ఆయన నటిస్తున్నారు.
ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి సాయి పల్లవి (Sai Pallavi) జోడీగా నటిస్తోంది. ఈ మూవీ 2025 ఫిబ్రవరి 7న విడుదల కానుంది. అంతేకాదు, ‘విరూపాక్ష’ (Virupaksha) ఫేమ్ కార్తీక్ దండు (Karthik Varma Dandu) దర్శకత్వంలో ‘NC 24’ అనే మరో ప్రాజెక్ట్ కూడా చైతూ లైనప్‌లో ఉంది. శ్రీలీల (Sreeleela) ఈ చిత్రంలో కథానాయికగా నటించనుంది. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్స్‌పై ఈ సినిమా రూపొందుతుండటంతో, సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
‘దూత’ (Dhootha) వెబ్ సిరీస్‌తో డిజిటల్ వేదికపై విజయవంతమైన ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య, తన సీక్వెల్‌కు సంబంధించిన పనులను కూడా ప్రారంభించినట్లు సమాచారం. విక్రమ్ కె కుమార్ (Vikram kumar) దర్శకత్వంలో ‘దూత 2’ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు, శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో చైతన్య ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.