గాసిప్స్ కోసం తన పేరుని వాడుకోవడంతో బాధపడ్డానని హీరో నాగచైతన్య అన్నారు. ‘లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగచైతన్య. ప్రతి ఒక్కరికి వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలు ఉంటాయని.. ఆ రెండిటినీ వేర్వేరుగా చూస్తానని అన్నారు. నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన సమయంలో పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ను వేర్వేరుగా చూడడం నేర్చుకున్నానని..
ఈ విషయాన్ని తన తల్లితండ్రుల నుంచి తెలుసుకున్నానని అన్నారు. షూటింగ్స్ లేదా ఇతర బిజినెస్ వర్క్స్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన తరువాత వాళ్లిద్దరూ ఆ విషయాల గురించి చర్చించుకోరని.. అలానే వర్క్ లో ఉన్నప్పుడు పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించరని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై కూడా చైతు కొన్ని కామెంట్స్ చేశారు. ఒకానొక సమయంలో తనపై ఎన్నో అసత్య వార్తలు వచ్చాయని.. వాటిని చూసి కొంత బాధపడ్డానని.. ఇలాంటి వార్తలు ఎలా రాస్తారో అనుకునేవాడిని అని అన్నారు.
పాతరోజుల్లో మ్యాగజైన్స్ ఉండేవని.. నెలకో మ్యాగజైన్ వచ్చేదని.. దాని వలన ఒక నెలంతా అదే వార్త వినిపిస్తుండేది కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని అన్నారు. క్షణాల్లో ఒక వార్తలు మరో వార్తను రీప్లేస్ చేస్తుందని.. ఎన్ని వార్తలు వచ్చినా.. నిజాలు మాత్రమే ప్రజలకు గుర్తుంటాయని అర్ధమైనప్పటి నుంచి వాటి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని చైతు చెప్పుకొచ్చారు.