Thandel: తండేల్ మూవీ రిలీజ్ కోసం ఆ స్పెషల్ డేను పరిశీలిస్తున్నారా?

నాగచైతన్య (Naga Chaitanya)  హీరోగా చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తండేల్ (Thandel)   మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా వల్ల ఈ సినిమా వాయిదా పడక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే తండేల్ సినిమా రిలీజ్ కోసం జనవరి 24వ తేదీని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అప్పటికి సంక్రాంతి సినిమాలు విడుదలై రెండు వారాలు అవుతుంది కాబట్టి మేకర్స్ ఆ డేట్ పర్ఫెక్ట్ డేట్ అని ఫీలవుతున్నారని భోగట్టా..

Thandel

తండేల్ సినిమా నాగచైతన్య సినీ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాకు బిజినెస్ సైతం అదే స్థాయిలో జరుగుతోంది. తండేల్ సినిమాలో సాయిపల్లవి  (Sai Pallavi)  హీరోయిన్ కావడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి ఒక విధంగా కారణమని చెప్పవచ్చు. చైతన్య సాయిపల్లవి కాంబోలో తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ ఊహించని స్థాయిలో హిట్ గా నిలిచి ప్రేక్షకులను మెప్పించింది..

అయితే సంక్రాంతి సినిమాలను చూసిన ప్రేక్షకులు తండేల్ సినిమాను చూడాలంటే సినిమాకు అద్భుతమైన టాక్ రావాల్సి ఉంది. తండేల్ సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా ఈ సినిమా నాగచైతన్య రేంజ్ ను ఎన్నో రెట్లు పెంచడం గ్యారంటీ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తండేల్ సినిమా కథ, కథనం కొత్తగా ఉంటాయని సమాచారం అందుతోంది.

చందూ మొండేటి పారితోషికం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. చందూ మొండేటి ఈ సినిమాతో కూడా సక్సెస్ సాధిస్తే ఆయన రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చందూ మొండేటి టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ డైరెక్టర్లలో ఒకరు కాగా ఈయన రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చందూ మొండేటి సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తున్నారు.

గోపీచంద్ ప్లాప్ సినిమాకి.. ‘దేవర’ కి సంబంధం ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus