Naga Shaurya,Ketika Sharma: రీతూ వర్మ గురించి అలా… కేతిక గురించి ఇలా.. నాగశౌర్య కామెంట్స్ వైరల్..!

మొన్నటికి మొన్న ‘వరుడు కావలెను’ ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ రీతూ వర్మ గురించి నాగ శౌర్య చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయ్యాయి. ఆ ఈవెంట్ లో తనకి రీతూ వర్మ ప్రపోజ్ చేసింది అంటూ సినిమాలో ఉన్న ఎపిసోడ్ ను అడ్డం పెట్టుకుని కాసేపు ఫన్ క్రియేట్ చేసాడు నాగ శౌర్య. అటు తర్వాత ఆమె ఈ వేడుకకి రాలేదని తనకి.. ఆమెతో గొడవలు ఉన్నాయి అనుకోవద్దని కూడా కామెంట్స్ చేసాడు.

అక్కడ ఏమీ లేకపోయినా ఏదో ఉందన్నట్టు ఆ కామెంట్స్ ఉండడం వల్ల అవి వైరల్ అయ్యాయి. తాజాగా ‘లక్ష్య’ ప్రమోషన్లలో కూడా హీరోయిన్ గురించి నాగశౌర్య చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. నాగశౌర్య మాట్లాడుతూ.. ” ఆ అమ్మాయిని చూస్తే ఎవ్వరికైనా సరే రొమాన్స్ చేయాలనిపిస్తుంది.నాకు కూడా అదే అనిపించింది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడమే ఇంత ఫ్యాన్ బేస్ ను సంపాదించుకోవడం ఏ హీరోయిన్ కు సాధ్యం కాదు.

చాలా తక్కువ మందికే అది వర్కౌట్ అవుతుంది. దాన్ని కాపాడుకో” అంటూ చెప్పుకొచ్చాడు. కేతిక మొదటి చిత్రం ‘రొమాంటిక్’ అన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఈ అమ్మడు ఓ రేంజ్లో అందాలు ఆరబోసింది. దీంతో ఒక్కసారిగా ఆమెకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.’రొమాంటిక్’ యవరేజ్ గా ఆడింది అంటే అది కూడా ఈమె వల్లనే అని చెప్పడంలో ఎటువంటిది సందేహం లేదు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus