పెళ్లి తేదీ దగ్గర పడిన ఆసుపత్రిలోనే నాగశౌర్య.. పెళ్లి సమయానికి కోలుకుంటారా?

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ఓ సినిమా షూటింగ్ నిమిత్తం పాల్గొనగా షూటింగ్ లొకేషన్లోనే సొమ్మసిల్లి పడిపోవడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే ఈయనని చిత్ర బృందం గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. ఇలా ఈయన సొమ్మసిల్లి పడిపోవడంతో చిత్ర బృందం ఆందోళన చెందుతూ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నాగ శౌర్య నటిస్తున్న ఓ సినిమా షూటింగ్లో భాగంగా ఒక యాక్షన్ సన్ని వేషాన్ని తెరకెక్కించడం కోసం నాగశౌర్య సరైన ఫుడ్ తీసుకోలేదట.

దీంతో ఈయన డిహైడ్రేషన్ కి గురయ్యారని తెలుస్తోంది. ఈ విధంగా డిహైడ్రేషన్ కారణంగా నాగశౌర్య షూటింగ్ లొకేషన్లోనే పడిపోవడంతో చిత్ర బృందం ఆయనని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా ఈయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాలేదని సమాచారం.ఇకపోతే నాగశౌర్య పెళ్లి మరో నాలుగు రోజులు ఉండగా ఇలా ఈయన ఆసుపత్రి పాలు కావడంతో అభిమానులు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాగశౌర్య ఈనెల 20వ తేదీన బెంగళూరుకు చెందిన అనూష శెట్టి అనే ఒక ఇంటీరియర్ డిజైనర్ ను వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇలా ఇతను వివాహం చేసుకోవడానికి మరో నాలుగు రోజుల సమయం ఉందనగా ఇలా అనారోగ్యం పాలయి నాగశౌర్య హాస్పిటల్ లో ఉండడం గమనార్హం. ఈ హీరో హాస్పిటల్లో ఉండడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ పెళ్లి సమయానికైనా నాగశౌర్య కోలుకుంటారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోని ఈయన తిరిగి కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాచిలర్ హీరోలలో ఒకరిగా ఉన్నటువంటి నాగశౌర్య మరికొన్ని రోజులలో తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus