Naga shaurya Wedding: ఓ ఇంటివాడు కాబోతున్న నాగ శౌర్య.. అమ్మాయి ఎవరంటే?

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య… అందరికీ సుపరిచితుడే. 10 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు.యూత్ కు కనెక్ట్ అయ్యే సినిమాలు చేస్తూ పలు విజయాలు అందుకున్నాడు. 2011లో వచ్చిన ‘క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్’ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఇతను ఆ తర్వాత ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన ‘చందమామ కథలు’ లో కూడా నటించాడు. అయితే ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం ఇతనికి హీరోగా మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ‘దిక్కులు చూడకు రామయ్య’ ‘ఓ బేబీ’ ‘ఛలో’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.

 

అలాగే ఇతని కెరీర్లో పలు యావరేజ్ అనిపించుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. తన నటన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటూ వస్తున్న నాగ శౌర్యకు అమ్మాయిల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉండగా.. ఈ హ్యాండ్సమ్ హీరో త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అవును నాగ శౌర్య పెళ్లి నవంబర్ 20న బెంగళూర్ లో ఉదయం 11 గంటల 25 నిమిషాలకు ఘనంగా జరగబోతోంది.నాగ శౌర్య పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు అనూష.

ఈమె గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక 19న మెహందీ ఫంక్షన్ … సంగీత్ వంటి కార్యక్రమాలతో నాగ శౌర్య పెళ్లి సందడి మొదలు కాబోతుంది. తల్లి ఉషా ముల్పూరి, తండ్రి శంకర్ ప్రసాద్.. నాగ శౌర్య పెళ్లి వేడుకలను ఘనంగా జరపనున్నారు. సినిమాల విషయానికి వస్తే ఈ మధ్యనే ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన నాగ శౌర్య .. ‘ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రం షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus